Arnab Cyclone : అప్పట్లో హుద్ హుద్ తుఫాను విశాఖపట్నం నగరాన్ని ఎంతలా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. విశాఖపట్నంలోనే ఉన్నారు. దాదాపు మూడు రోజులపాటు నిత్యం క్షేత్రస్థాయిలో నడిచింది. అధికారులను సమన్వయం చేసుకున్నారు. మూడు రోజుల్లోనే విద్యుత్ సరఫరా చేయగలిగారు. విశాఖపట్నం మొత్తం కొద్ది రోజుల్లోనే అన్ని వ్యవస్థలను ఒక గాటికి తీసుకురాగలిగారు. ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర […]
అర్నాబ్ తుఫాను: అప్పట్లో హుద్ హుద్ తుఫాను విశాఖపట్నం నగరాన్ని ఎంతలా నాశనం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. విశాఖపట్నంలోనే ఉన్నారు. దాదాపు మూడు రోజులపాటు నిత్యం క్షేత్రస్థాయిలో నడిచింది. అధికారులను సమన్వయం చేసుకున్నారు. మూడు రోజుల్లోనే విద్యుత్ సరఫరా చేయగలిగారు. విశాఖపట్నం మొత్తం కొద్ది రోజుల్లోనే అన్ని వ్యవస్థలను ఒక గాటికి తీసుకురాగలిగారు.
ఇప్పుడు అర్నబ్ తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలను.. కోస్తా ఆంధ్రా ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురుస్తోంది. గాలి తీవ్రతకు చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిపోయింది. అయినప్పటికీ నిత్యం అధికారులతో సమీక్షలు జరుపుతూ.. ఆర్ టి జి వ్యవస్థ ద్వారా అధికారులను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం తీసుకుంటూ.. జనాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించింది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వైద్య సిబ్బందిని.. అప్రమత్తం చేసింది.. రెవిన్యూ.. విద్యుత్.. పురపాలకం.. గ్రామీణ అభివృద్ధి శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
తుఫాన్ నేపథ్యంలో రాత్రి నుంచి ఉదయం వరకు అధికారులు.. యంత్రంతో ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజల ఇబ్బందులు తొలిగేలా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మండల.. గ్రామస్థాయి సిబ్బందితో మాట్లాడుతున్న నేపథ్యంలో.. యంత్రాంగమంతా అప్రమత్తంగా మారింది. రాత్రి నుంచి రోడ్లపై ఉండి తుఫాన్ సహాయక చర్యల్లో సిబ్బంది పాల్గొంటున్నారు. నేలకూలిన చెట్లను తొలగించే ప్రక్రియను రియల్ టైంలో విద్యుత్ శాఖ సిబ్బంది చేస్తున్నారు. అయితే తుఫాన్ నష్టం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందుగానే విద్యుత్ స్తంభాలు.. సామగ్రిని అధికారులు సిద్ధం చేశారు.. వాట్సాప్.. సోషల్ మీడియా.. మీడియా.. కంట్రోల్ రూమ్ లకు వస్తున్న సమాచారం సచివాలయంలో ఆర్టిజి సెంటర్ ద్వారా తుఫాన్ ప్రభావం.. సహాయక చర్యలపై నిత్యం చంద్రబాబు సమీక్షిస్తూనే ఉన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటే ఆయన ఏసీ రూంలో కూర్చొని.. మాట్లాడే రకం కాదు. హెలికాప్టర్‌లో తిరిగి ఫోటోలకు ఫోజులు ఇచ్చేది ముఖ్యమంత్రి కాదు. ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుతుంటారు. అధికారులతో సమీక్షలు జరుపుతారు. సహాయక చర్యలపై ఆరా తీస్తూ ఉంటారు.
