Home ఆంధ్రప్రదేశ్ ఏబీ వెంకటేశ్వరరావు: వైసీపీ అజెండానే.. ఆ మాజీ – Andhra Waves

ఏబీ వెంకటేశ్వరరావు: వైసీపీ అజెండానే.. ఆ మాజీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


ఏబీ వెంకటేశ్వరరావు: మాజీ ఐపీఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. సీనియర్ అధికారిగా ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. కాకపోతే ఆయన మాట్లాడుతున్న తీరు విచిత్రంగా.. విడ్డూరంగా ఉంది. ఒక పార్టీ ముక్కలో చెప్పాలంటే ఆయన ప్రకటించిన తీరు.. అచ్చం ఫ్యాన్ పార్టీ తరహాలోనే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల […]

ఏబీ వెంకటేశ్వరరావు: మాజీ ఐపీఎస్ అధికారి ఏ బి వెంకటేశ్వరరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. సీనియర్ అధికారిగా ఆయనకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది. కాకపోతే ఆయన మాట్లాడుతున్న తీరు విచిత్రంగా.. విడ్డూరంగా ఉంది. ఒక పార్టీ ముక్కలో చెప్పాలంటే ఆయన ప్రకటించిన తీరు.. అచ్చం ఫ్యాన్ పార్టీ తరహాలోనే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థానిక ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మేయర్ పదవికి ఆయన బరిలోకి దిగారు. ఈ సమయంలో అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని మరో విధంగా చూపిస్తున్నాయి. వాస్తవానికి సమావేశంలో చాలా హుందాగా మాట్లాడాల్సిన ఆయన.. తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడారు. ఇప్పటివరకు ఒక విశ్రాంతి అధికారిగా ఆయనకు ఉన్న గౌరవం కాస్త తగ్గిపోయింది..

ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన ఆయన తన భాషను.. తన బాడి లాంగ్వేజ్ ను పూర్తిగా వైసిపికి అనుకూలంగా ప్రదర్శించడం విశేషం. ఒకరకంగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట తాడేపల్లి ప్యాలస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ లాగా ఉంది. వైసిపి నాయకులకు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబును కించపరచడం అలవాటు. చంద్రబాబు ప్రస్తావన లేకుండా వారు మాట్లాడారు.. ఏబీ వెంకటేశ్వరరావు కూడా అలానే మాట్లాడడం విశేషం. అప్పట్లో వర్షాలు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని.. ఆ సమయంలో ఆయన బస్సులో ఉన్నారట. నిజానికి వర్షాలు వచ్చినప్పుడు చంద్రబాబు ఇల్లు మునిగిపోలేదు. పైగా వరదలు చోటు చేసుకున్నప్పుడు అందరితోపాటు చంద్రబాబు కూడా బస్సులో ఉన్నారు. ఇలాంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతారు. కాకపోతే ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీకి నాయకులను మించిన స్థాయిలో మాట్లాడటం విశేషం. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి వైసిపి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించింది. అయితే వైసిపి తన రాజకీయాలకు అనుకూలంగా మైండ్ గేమ్ ఆడింది. అయితే వైసీపీ చేసిన ట్వీట్లను ఏబీ వెంకటేశ్వరరావు తన ఖాతాలో రీ ట్వీట్ చేయడం విశేషం.

రాజకీయాల్లో ఎవరికైనా సరే ఒక గెస్ట్ ఆఫ్ హానర్ అనేది ఉంటుంది. దానిని ప్రదర్శించాలి కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ బి వెంకటేశ్వరరావు ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసింది. పెన్షన్ నిలిపివేసింది. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది. ఆ సమయంలో ఆయనకు టిడిపి అండగా నిలిచింది. న్యాయపోరాటం జరుగుతున్నప్పుడు నైతిక స్థయిర్యాన్ని అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ వివాదం పరిష్కరించబడింది. బకాయిలను విప్పించింది. ఆయన స్థాయికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చింది.. అయితే ఇంతటితో ఏబి వెంకటేశ్వరరావు సంతృప్తి పడలేదు. అధికార దాహం ఆయనను నిలవనీయలేదు. పైగా అత్యాశతో ఆయన ఇంకా పెద్ద పదవి కావాలని కోరుకున్నారు. నామినేటెడ్ పదవిని కూడా వదులుకొని చివరికి ఇలా స్థాయిని తగ్గించుకున్నారు. నమ్మిన వారికి వెన్నుపోటు పొడిచేస్తున్నారు ఆయన అడుగడుగునా చాటుతున్నారు.

ఇక ఏ బి గతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. చంద్రబాబును రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రక్రియను అనేకం సాగించారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ ఉన్నారు. ఆ సమయంలో వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు.. ఎలాంటి ఇంటిలిజెన్స్ ఉపయోగించారో ఇప్పటికే తెలియదు. నాటి ఘటనను గుండెపోటుగా చిత్రీకరించి వైసిపి ఆడిన పొలిటికల్ గేమ్ ను అంచనా వేయడంలో ఏబి అట్టర్ క్లాస్ అయ్యారు. ఆయన నిర్లక్ష్యం వల్ల చంద్రబాబు తలవంచుకోవాల్సి వచ్చింది. డిఫెన్స్ మోడ్ లో పడాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు ఎటువంటి కక్ష సాధింపులకు దిగలేదు. ఏబి కి అగ్ర తాంబూలం అందించారు. అటువంటి ఏబి ఇప్పుడు పొలిటికల్ లబ్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం మీద ఈ స్థాయిలో విషం చిమ్మడం విశేషం.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird