వైఎస్ జగన్: వైసిపి అధినేత జగన్ (వైఎస్ జగన్) సొంత నియోజకవర్గం పులివెందులను టిడిపి (టిడిపి) సొంతం చేసుకుంది. పులివెందుల ప్రాంతంలో 65 ఎంపీటీసీ స్థానాల్లో.. 64 కూటమి సొంతమైంది. ఏడు జెడ్పిటిసి స్థానాల్లో మూడు కూటమి సొంతం చేసుకుంది. ఇదే నియోజకవర్గంలో వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 17 కూటమి సొంతం చేసుకుంది. ఇక పులివెందుల మండలంలో ఉన్న ఐదు ఎంపీటీసీ స్థానాల్లో టిడిపి అభ్యర్థులు.. వేంపల్లి మండలంలో ఉన్న ఎనిమిది […]
వైఎస్ జగన్: వైసిపి అధినేత జగన్ (వైఎస్ జగన్) సొంత నియోజకవర్గం పులివెందులను టిడిపి (టిడిపి) సొంతం చేసుకుంది. పులివెందుల ప్రాంతంలో 65 ఎంపీటీసీ స్థానాల్లో.. 64 కూటమి సొంతమైంది. ఏడు జెడ్పిటిసి స్థానాల్లో మూడు కూటమి సొంతం చేసుకుంది.
ఇదే నియోజకవర్గంలో వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 17 కూటమి సొంతం చేసుకుంది. ఇక పులివెందుల మండలంలో ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. వేంపల్లి మండలంలో ఉన్న ఎనిమిది ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. చక్రాయపేటలో 9 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. తొండూరు మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు.. సింహాద్రిపురం మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు.
సింహాద్రిపురం.. తొండూరు.. చక్రాయపేట జెడ్పిటిసి స్థానాలను టిడిపి తన ఖాతాలో వేసుకుంది. పులివెందుల పురపాలకంలో 20 వార్డులను కూటమి దక్కించుకుంది.. ఇవన్నీ కూడా ఏకగ్రీవంగానే.. నిజానికి పులివెందుల అంటే అప్పట్లో వైయస్.. ఇప్పుడు జగన్.. కానీ ఈ కోట బద్దలైంది.. లోకల్ బాడీ ఎలక్షన్‌లో ఈ స్థాయిలో టిడిపి దూకుడు చూపిస్తుందని.. పులివెందులలో ఏకంగా ఛత్రాధిపత్యం సాగుతుందని ఎవరూ ఊహించలేదు. స్థానిక ఎన్నికల్లో భయపెడుతున్నారు.. పోలీసులను దింపుతున్నారు.. నామినేషన్లను వేయనీయడం లేదు.. ఇది గెలుపు ఎలా అవుతుంది.. రాష్ట్రం మొత్తం ఇలానే సాగుతోంది.. అని వైసిపి ఆరోపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవు.
కానీ, ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాలి.. ఏ ప్రాంతం కూడా.. ఏ రాజకీయం కూడా ఒక కుటుంబానికి మాత్రమే సొంతం కాదు. ఎల్లకాలమూ పాదాక్రాంతం కాదు. ఇప్పటికాలంలో పొలిటికల్ మర్యాదలు లేవు. అసలు ఆ కాలం ఎప్పుడో వెళ్లిపోయింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పం జోలికి వెళ్లేవారు కాదు. పులివెందుల ప్రాంతం వైపు కూడా చంద్రబాబు కన్నెత్తి చూసేవారు కాదు. ఒకరకంగా నాన్ ప్రోటోకాల్ మర్యాదలు నాటి పాలిటిక్స్ లో కొనసాగేవి.
ఇప్పుడు లోకేష్ జమానా నడుస్తోంది. మొన్నటిదాకా జగన్ హవా కొనసాగింది. కుప్పం ఎందుకు కాకూడదు.. 175 ఎందుకు సాధించకూడదు అన్నాడు జగన్.. కానీ పరిస్థితి మారిపోయింది.. 175 నుంచి 11కు దిగజారిపోయాడు. అంతకుముందు చంద్రబాబు 23కు తగ్గిపోయాడు.. కానీ ఇదే సమయంలో సరిగ్గా గురిపోయాడు.. పులివెందుల మన చెంతకు రాదా అని లోకేష్ అనుకున్నారు. అనుకున్నట్టుగానే కొట్టేశారు. సతీష్.. రాజేష్ చెంత ఉన్నారు కాబట్టి.. లోకేష్ ఇప్పట్లో తన దూకుడు తగ్గించలేకపోయాడు. ఆర్థికంగా సంపత్తి ఉంది. మీడియా పరంగా బలం ఉంది. పవన్ సపోర్ట్ దడిగా ప్రారంభించాడు. ఇలాంటప్పుడు లోకేష్ ముట్టుకుంటే బంగారం.. పట్టుకుంటే వజ్రం..
గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జగన్ చేసిన పని ఇప్పుడు లోకేష్ పలువురు అంటున్నారు. రేపటి నాడు జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా.. అసలు మొత్తం మూసుకుపోయే విధంగా లోకేష్ తొక్కుతున్నాడు.
ఇక ఈ భోజనం పక్కన పెడితే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించిన తొలి రోజుల్లో.. పవన్ కళ్యాణ్.. నాగబాబు పెద్దగా పట్టించుకోని రోజుల్లో.. వ్యవహారాలన్నీ అల్లు అరవింద్ చూసుకున్నారు. అప్పటి కాలంలో అరవింద్ దూకుడుగా ఉన్నారు.. ఎవరో ఒకరు విలేకరి అడిగితే.. కుప్పం.. పులివెందుల మినహాయిస్తే మిగతా అందరినీ గెలుస్తామని చెప్పారు. పొలిటికల్ మర్యాద కోసం వాటిని వదిలేస్తున్నామని అన్నారు. కానీ అటువంటి తీర్పులను రాజకీయ నాయకులు తమకు తాముగా ఇచ్చుకోవచ్చు. కానీ ప్రజలు ఇచ్చేదే అంతిమం.
కుప్పం ఎందుకు కాకూడదు అని జగన్ అన్నప్పుడు.. పులివెందుల ఎందుకు దక్కకూడదు అని లోకేష్ చెప్పినప్పుడు.. ఇవేవీ అసాధ్యం కానీ విషయాలు కాదు.. ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్.. సిద్దిపేట ప్రాంతంలో హరీష్ రావు.. గజ్వేల్ ప్రాంతంలో కేసీఆర్ ఓడ కొట్టడం పెద్దగా సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాంతం ఒకరి చేతుల్లో ఎప్పటికీ ఉండదు. అక్కడిదాకా ఎందుకు 2023లో కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోలేదా.. అంతకుముందు రేవంత్ రెడ్డి పరాజయం పాలు కాలేదా.. పరిస్థితి ఇలానే ఉంటే.. రేపటినాడు తెలంగాణలో మాత్రం పులివెందుల ఫలితం రాదని లేదు కదా..
