Home ఆంధ్రప్రదేశ్ YS Jagan Mohan Reddy: జగన్ కు దీపావళి గిప్ట్ ఇచ్చిన ఈడీ.. – Andhra Waves

YS Jagan Mohan Reddy: జగన్ కు దీపావళి గిప్ట్ ఇచ్చిన ఈడీ.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan Mohan Reddy: తెలంగాణ హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మామూలు పిటిషన్ కాదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించింది.. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కొద్దిరోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిల్ మీద కొనసాగుతూనే ఉన్నారు. 11 సీట్లకే మొన్నటి ఎన్నికల్లో పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరో షాకిచ్చింది. ఆయన […]

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి: తెలంగాణ హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మామూలు పిటిషన్ కాదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించింది.. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన కొద్దిరోజులపాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిల్ మీద కొనసాగుతూనే ఉన్నారు. 11 సీట్లకే మొన్నటి ఎన్నికల్లో పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరో షాకిచ్చింది. ఆయన అక్రమ ఆస్తుల కేసుల వ్యవహారాన్ని తేల్చాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది కూడా రిట్ రూపంలో వేసింది.

ఈ పిటిషన్ జగన్ రాజకీయ భవిష్యత్తును అత్యంత కష్టాల్లోకి పడేసేలా ఉంది. సీబీఐ కేసులు ఫైల్ చేసింది. ఆ ఎంక్వయిరీ ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడంలేదు. ఈ నేపథ్యంలోన ఈడీ సడన్ గా ప్రవేశించింది. ఒకవేళ పీఎంఎల్ఏ కేసుల విచారణ రోజువారీ విధానంలో మొదలైతే జగన్ కు ప్రతిరోజు 70 ఎంఎం రేంజ్ లో పిక్చర్ కనిపించడం దాదాపు ఖాయం. సాధారణమైన క్రిమినల్ కేసులను సెంట్రల్ బ్యూరో ఇన్ ఆఫ్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తుంది. అత్యంత కఠినమైన ఆర్థిక నేరాలను ఈడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.

సీబీఐ దర్యాప్తు ఒక విధంగా సాగిపోతుంటే.. ఈడీ నమోదు చేస్తే కేసుల్లో చాలా తీవ్రత ఉంటుంది. జగన్ విషయంలో ఈడి రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. తన మీద వచ్చిన అభియోగాలు తప్పు అని జగన్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం.. జగన్ ఎటువంటి తప్పు చేయలేదు. తన కంపెనీలోకి వచ్చిన డబ్బు అక్రమమైనది కావాలి అతని కోర్టు ఎదుట నిరూపించుకోవాలి. హెటిరో.. అరబిందో.. భారతి సిమెంట్స్.. జగతి పబ్లికేషన్స్ లో షేర్లను భారీ విలువకు ఎందుకు కొన్నారో కూడా చెప్పగలగాలి. బ్యాంకింగ్ లావాదేవీలు.. మనీ ట్రయల్ ఆధారాలు ఈడి వద్ద ఉన్నాయి. ఇక సిబిఐ కేసుల్లో సాక్షుల వాంగ్మూలాలు.. వారి విశ్వసనీయత ఆధారంగా దర్యాప్తు సాగిపోతూ ఉంటుంది. ఈడీ కేసులు అలా ఉండవు. డాక్యుమెంటరీ సాక్షాలు. డిజిటల్ లెడ్జెర్లు.. బ్యాంక్ రికార్డులు అత్యంత ముఖ్యమైనవి. అందుకే ఈడీ కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అంత ఈజీ కాదు.

ఈడి అస్త్రం మీద విచారణను ఆలస్యం చేయడానికి ఇప్పటికే జగన్ టీం ఎత్తుగడలు వేసినట్లు చూపిస్తున్నాయి. న్యాయ అన్ని పనులు కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇందులో మొదటి అడుగుగా పిడికేట్ అపెక్స్ వాదనను ఈడి తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. జగన్ మీద ఇప్పటికే సిబిఐ మూల నేరం మోపింది. అందువల్ల ఈ డి జగన్ మీద మోపిన మనీ లాండరింగ్ కేసులపై విచారణ జరపడం సాధ్యం కాదని.. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ జగన్ అండ్ కో హైకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకే ఈ విచారణ నిలిపివేయాలని.. ఇలా రెండు పిటిషన్లు జగన్ లీగల్ టీం వేసే అవకాశం ఉంది..

ఇప్పటికే జగన్ ఇళ్ల తరబడి విచారణను అడ్డుకుంటున్నారు. డిశ్చార్జ్ పిటిషన్ ప్రక్రియను మరింత పొడిగిస్తున్నారు. దీనికి తోడు ఈడి 9 ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను దాఖలు చేసింది. ఇందులో ఉన్న కంపెనీలు.. బ్యూరోక్రాట్లు.. ఇతర నిందితులు డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేస్తే.. వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తారు. లేదా సుప్రీంకోర్టు తలుపులు తడతారు. స్టే తెచ్చుకుంటారు. మరో ఐదు ఆరు నెలల పాటు వాయిదా వేసే ప్రణాళిక అమలు చేస్తారు.

జగన్ తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. తను ఒక రాజకీయ పార్టీకి ప్రధాన నాయకుడని.. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన అవసరం లేదని.. భద్రతా కారణాలు ఆర్థిక నేరస్తుల విషయంలో గతంలోనే ఆర్టికల్ 21 సత్వర న్యాయ విచారణ అవసరమని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ అండ్ కో వేసే స్టెప్పులను తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం ఎలా చూస్తోంది ఇప్పుడు ఇంట్రెస్‌గా మారింది. ఒకవేళ రోజువారి విచారణ మొదలైతే.. జగన్ కేసులు రోజుకో మలుపు తిరుగుతాయి. అప్పుడు ఈడి మరింత గట్టిగా ఉచ్చులు వేస్తుంది. దాని నుంచి జగన్ కు అంత ఈజీ కాకపోవచ్చు. ఒకవేళ ఈడి మరింత లోతుగా ఈ కేసును తవ్వితే.. జగన్ దీపావళి పండుగను ఈ కోర్టులోనే జరుపుకోవాల్సి ఉంటుంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird