Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ షర్మిల: యలహంక ప్యాలెస్ షర్మిలదే.. తేల్చి చెప్పింది – Andhra Waves

వైఎస్ షర్మిల: యలహంక ప్యాలెస్ షర్మిలదే.. తేల్చి చెప్పింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


వైఎస్ షర్మిల: అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నాటి రోజులలో సత్యం కుంభకోణం జరిగింది. యావత్ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. దర్యాప్తు సంస్థలు పని మొదలుపెట్టాయి. సత్యం రామలింగరాజు అరెస్టు అయ్యారు. ఇంకా రకరకాల పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇంతలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నాటి అక్కడి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. కుటుంబంతో కలిసి మూడు రోజులపాటు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని రాజశేఖర్ […]

వైఎస్ షర్మిల: అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నాటి రోజులలో సత్యం కుంభకోణం జరిగింది. యావత్ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. దర్యాప్తు సంస్థలు పని మొదలుపెట్టాయి. సత్యం రామలింగరాజు అరెస్టు అయ్యారు. ఇంకా రకరకాల పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇంతలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నాటి అక్కడి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. కుటుంబంతో కలిసి మూడు రోజులపాటు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాజశేఖర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పని పూర్తి చేసిన తర్వాత.. 2009 జనవరి 16 రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్, మనుమలు, మనమరాళ్లతో కలిసి రాజశేఖర్ రెడ్డి యలహంక వెళ్లారు. అప్పటికి అంజలి వయసు ఏడు సంవత్సరాలు.

సరిగ్గా జనవరి 16న ఆమె జన్మదినం. దానిని పురస్కరించుకొని గృహప్రవేశ వేడుకను రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి జరిపారు. పైగా షర్మిల నివాసాన్ని అత్యంత దగ్గరుండి కట్టించారు. షర్మిల అభిరుచికి తగ్గట్టుగానే రాజశేఖర్ రెడ్డి ఆ ఇల్లు నిర్మించారని ఇప్పటికి చెబుతుంటారు. నాడు ఏడు సంవత్సరాల వయసులో ఉన్న అంజలి ఇప్పుడు 24 ఏళ్ల వయసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిల ఆమెకు పెళ్లి ఖరారు చేశారు. ఈరోజులో తన తండ్రి కట్టించిన నివాసంలో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. కానీ దీనిని జగన్ అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే షర్మిలకు లేఖలు రాశారు. నిజానికి ఆ ఆస్తి మొత్తం జగన్ ది అని వైసిపి నాయకులు.. సాక్షి మీడియా వాదిస్తోంది. కానీ నాడు జరిగిన విషయం మొత్తం ప్రఖ్యాత ఆంగ్ల పత్రికలో తాటికాయ పరిమాణంలో ప్రచురితమైనది. ఇదే విషయాన్ని టిడిపి నేతలు బయటపెడుతున్నారు. ఆడపిల్లను ఇబ్బంది పెట్టి.. ఆమెను ఏడిపించి.. జగన్ తన పైశాచిక ఆనందం పొందకుండా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్యాలెస్ విషయంలో జాతీయ మీడియా సైతం నాడు జరిగిన వ్యవహారాన్ని ప్రధానంగా ప్రచురించడంతో జగన్ అండ్ కో కు నోటి మాట రావడం లేదు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే యలహంక ప్యాలెస్ లో ఎవరి ఇల్లు వారికి కట్టారు. చెరి పది ఎకరాల్లో నివాస సముదాయాలు నిర్మించారు. కానీ, షర్మిల నివాసాన్ని కూడా తనదే అని జగన్ చెప్పడం ఇక్కడ అసలైన ఐరనీ.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird