Home ఆంధ్రప్రదేశ్ Arnab Cyclone: ​​వర్షం లేకపోయినా.. ముందుకొచ్చిన సముద్రం.. – Andhra Waves

Arnab Cyclone: ​​వర్షం లేకపోయినా.. ముందుకొచ్చిన సముద్రం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


అర్నాబ్ సైక్లోన్: ఆకాశం మేఘావృతమైంది. చిన్న చిన్న జల్లులు మాత్రమే కురుస్తున్నాయి.. గాలులు మాత్రం భీకరంగా వీస్తున్నాయి. చూసేందుకు ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ అక్కడి జనాలకు మాత్రం నరకం.. క్షణక్షణం భయం.. ఏం జరుగుతుందో తెలియని భయానకం.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారుల వేటకు వెళ్లడం లేదు. అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు […]

అర్నాబ్ తుఫాను: ఆకాశం మేఘావృతమైంది. చిన్న చిన్న జల్లులు మాత్రమే కురుస్తున్నాయి.. గాలులు మాత్రం భీకరంగా వీస్తున్నాయి. చూసేందుకు ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ అక్కడి జనాలకు మాత్రం నరకం.. క్షణక్షణం భయం.. ఏం జరుగుతుందో తెలియని భయానకం.. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారుల వేటకు వెళ్లడం లేదు. అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అర్నాబ్ తుఫాన్ వల్ల ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాలులు కూడా వీస్తున్నాయి. యానాం దగ్గర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం ఏపీలో స్పష్టంగా కనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో తుఫాన్ ప్రభావం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వరికోతలు మొదలయ్యాయి. ధాన్యం తడిసింది. తుఫాన్ రైతులు వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని.

అర్నబ్ వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఉప్పాడ ఏరియాలో సముద్రపు అలజడి తీవ్రంగా ఉంది. దారులపై నుంచి నీరు ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉప్పాడ ప్రాంతంలో అంతగా వర్షం కురవడం లేదు. వాతావరణం మాత్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో సముద్రం భీకరంగా ఉంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దేశ ప్రజలు అప్రమత్తమై సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నష్టం ఎక్కువగా ఉంది.

గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుఫాన్ ఏపీ రాష్ట్రం మీద బుధవారం, గురువారం దాకా కనిపిస్తోంది. గాలుల వల్ల సముద్రం నుంచి అంత ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతంలో ఉన్న వారిని సురక్షితమైన ప్రాంతాలకు. ఉప్పాడ సముద్రానికి దగ్గరగా ఉంటుంది. తుఫాన్ వల్ల సముద్రం ముందుకు వచ్చింది. ఇక్కడ మాత్రమే కాకుండా.. కాకినాడ.. విశాఖపట్నం.. ఇతర తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird