Home ఆంధ్రప్రదేశ్ మిథున్ రెడ్డి: తొక్కించేయ్ నేను చూసుకుంటా.. ఇంతే కాదు – Andhra Waves

మిథున్ రెడ్డి: తొక్కించేయ్ నేను చూసుకుంటా.. ఇంతే కాదు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


మిథున్ రెడ్డి: తొక్కించేయ్.. నేను చూసుకుంటా.. పుంగనూరులో మిథున్ రెడ్డి టిడిపి శ్రేణులను ఎస్కార్ట్ వాహనాలతో తొక్కడానికి ప్రయత్నించారు.. వాస్తవానికి గౌరవ ఎంపీ స్థానంలో ఉన్న అతను వీధి రౌడీలా రెచ్చిపోయారు. అక్కడితోనే ఆగిపోలేదు.. పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్ ను చంపేస్తానంటూ బెదిరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిపై బెదిరింపులకు పాల్పడడం పట్ల ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి పుంగనూరులో జరిగింది ఇదేనా.. తెర వెనుక ఏమైనా ఉందా..

స్థానిక సంస్థలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ వేళ పుంగనూరులో వైసిపి నాయకులు ఉద్దేశపూర్వకంగానే భారీ ఎత్తున ఘర్షణలు జరిగాయి. ఏపీలో వైసిపి అధికారాన్ని కోల్పోయిన తర్వాత.. పెద్దిరెడ్డి కుటుంబానికి పుంగనూరు మీద పట్టు తగ్గుతున్న వేళ.. ఇంతటి దారుణానికి పాల్పడ్డారని మిథున్ రెడ్డిని ఉద్దేశించి టిడిపి నేతలు అంటున్నారు. ఇందులో భాగంగానే ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా.. మిథున్ రెడ్డికి అత్యంత వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాల మీదుగా తన అనుచరులతో కలిసి భారీ వాహనశ్రేణితో కదిలినట్లు సమాచారం. పుంగనూరులో జరిగిన పరీక్ష ఒకసారి.. అందులో ఉన్న కుట్ర కోణం ఎలా ఉంటుందో తెలుస్తుంది.

అధికారంలో లేకపోవడం పుంగనూరు ప్రాంతంలో హవా కొనసాగడానికి.. కిందిస్థాయి కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి మిథున్ రెడ్డి క్రమంగా ప్రయత్నిస్తున్నారు. నిజానికి ప్రశాంతంగా జరగాల్సిన నామినేషన్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా హింసాత్మకంగా మార్చేశారు. తన కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతాలు.. కూటమికి పట్టుకున్న ప్రాంతాల మీదుగా భారీ కాన్వాయితో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

కాన్వాయ్ లో మిథున్ రెడ్డికి అనుచరులు లేరు. పుంగనూరులో ప్రవేశించిన తర్వాత మిథున్ రెడ్డి వర్గంలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా అక్కడి వాతావరణం పూర్తిగా మార్చేశారు. కూటమినేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారు. హడావిడి చేశారు. దీంతో ఇప్పటికే కూటమినేతలు అక్కడ భారీగా ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మిథున్ రెడ్డి వాహన శ్రేణి ముందుకు వెళుతున్న కొద్దీ ఉద్రిక్తత పెరిగింది. నామినేషన్ అందుకున్న మిథున్ రెడ్డి కాన్వాయ్ లోని ఒక కారు బీభత్సం సృష్టించింది. అందరిని తొక్కడానికి ప్రయత్నించారు. దీంతో మిథున్ రెడ్డికి వివిధ రంగా ఉన్న వ్యక్తులు మొత్తం ఒక్కసారిగా రోడ్లమీదకి వచ్చారు. వాహన శ్రేణుని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ కోసం రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో మిథున్ రెడ్డి శ్రేణిలోని వాహనాలు ధ్వంసమయ్యాయి.

వైసిపి కార్యకర్తలు ముందుగా దాడులకు దిగడంతో.. ఆత్మ రక్షణ కోసం టిడిపి కార్యకర్తలు కూడా తిరుగుబాటు చేయవలసి వచ్చింది. పరిస్థితి ఒక్కసారిగా చేతుల నుంచి జారిపోయింది. నామినేషన్ సెంటర్‌లో మిథున్ రెడ్డి ఉండటంతో. దాడికి సిద్ధమయ్యారు.. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత మిథున్ రెడ్డిని వెంటనే నామినేషన్‌కి తీసుకెళ్లారు. . ఒక గదిలో భద్రత కల్పించారు. అయినప్పటికీ ప్రత్యర్థి వర్గాలు అక్కడికి దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

ఇరు వర్గాలను నియంత్రించడానికి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కొంతమందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు కర్త కర్మ క్రియ మిధున్ రెడ్డి. అయితే ఆయన రచించిన వ్యూహం చివరికి ఇంతటి హింసకు దారి తీసింది. హింసకు పాల్పడాలనే ఉద్దేశ్యంతోనే మిథున్ రెడ్డి అక్కడికి వచ్చారు. ఆయన వాహనాల్లో మద్యంతోపాటు మారణాయుధాలు కూడా ఉన్నాయి. ఘర్షణలో ఆ వాహనాలు ధ్వంసం కావడం విశేషం. అందువల్లే మద్యం.. మారణాయుధాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird