.webp)
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) ఎన్నికల అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన అత్యంత ఎన్నికల్లో కూటమి అఖండ విజయాన్ని సాధించింది. బీజేపీ జేడీఎస్ (JD-S) కూటమి పోటీ చేసిన మొత్తం 4 స్థానాల్లోనూ (4/4) ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ నమోదు చేశాయి. ఈ అనూహ్య పరిణామం కర్ణాటక పదవి రేసులో కీలక నేతగా ఉన్న, డిప్యూటీ సీఎం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.
ఈ ఎన్నికల ఫలితాలు సోషల్ మీడియా వేదికగా వెంటనే భారతీయ జనతా (BJP) రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో సెటైర్లు పేల్చింది. “డీకే.. ఇట్స్ డన్, బ్రో!” (DK, ఇది పూర్తయింది, బ్రో!) అనే క్యాప్షన్‌తో బీజేపీ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా భావించిన స్థానాల్లోనూ ఎండీఏ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి సాధించిన 4-0 చారిత్రాత్మక విజయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన నలుగురు అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శాసనమండలి ఎన్నికల ఫలితాలు ప్రస్తుత రాష్ట్రంలోని విజ్ఞులైన ఓటర్లు, పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారనడానికి తీవ్ర సంకేతమని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి రాజకీయాలకు ఈ తీర్పు అద్దం పడుతుందని యడియూరప్ప పేర్కొన్నారు.

జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల భవిష్యత్తుకు ఈ అపూర్వ విజయం ఒక బలమైన సూచిక అని. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి తమ ప్రభావాన్ని చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి, స్థానిక రాజకీయ సంస్థల పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎదురైన ఈ పరాభవం రాష్ట్ర సమీకరణలను వేగంగా మారుస్తోంది. డీకే శివకుమార్ నిర్వహిస్తున్న అభ్యర్థులు కూటమి అభ్యర్థులు జోరు చూపడం కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన కలిగింది. మొత్తానికి, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త హీట్‌ను రాజేయగా, రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపించింది.
[ Karnataka MLC elections, DK Shivakumar, BJP jabs Congress, NDA clean sweep, Karnataka politics, B.S. Yediyurappa, BJP JDS Alliance, Congress Party Karnataka, Shashil G Namoshi, Telugu News, Telugu One ]
