TDP సామాజిక న్యాయం: సీనియర్ ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసినప్పుడు.. కేవలం ఒక వర్గం.. ఒక కులానికి చెందిన వారు మాత్రమే కాకుండా.. అందరికీ అందులో ఉండే విధంగా కృషి చేశారు. అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే అన్ని కులాల వారు టిడిపి ద్వారా రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఇప్పటికీ ఇదే సూచన చెబుతూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పని చేసిన వారు.. ఎమ్మెల్యేగా పనిచేసినవారు.. […]
TDP సామాజిక న్యాయం: సీనియర్ ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసినప్పుడు.. కేవలం ఒక వర్గం.. ఒక కులానికి చెందిన వారు మాత్రమే కాకుండా.. అందరికీ అందులో ఉండే విధంగా కృషి చేశారు. అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే అన్ని కులాల వారు టిడిపి ద్వారా రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్లారు. ఇప్పటికీ ఇదే సూచన చెబుతూ ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులుగా పని చేసిన వారు.. ఎమ్మెల్యేగా పనిచేసిన వారు.. ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.
సీనియర్ ఎన్టీఆర్ నెలకొల్పిన సాంప్రదాయాన్ని.. చంద్రబాబు నాయుడు అంతకుమించి అనే స్థాయిలో కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయకత్వంలో టిడిపిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత లభిస్తోంది. అనేక వర్గాలకు చెందినవారు రాజకీయంగా అభివృద్ధి సాధిస్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు అదే స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. ఉన్నత పదవులు వారికి కట్టబెట్టారు.
ఎంపీపీ నుంచిపెడితే జెడ్పీ చైర్ పర్సన్ పదవులు అందించి.. అన్ని సామాజిక వర్గాల నుంచి తమకున్న ప్రేమను చాటుకున్నారు. చిత్తూరు జిల్లా నిండ్ర అయిన కన్యకాపురం ఎస్టీ కాలనీకి చెందిన 28 సంవత్సరాల మాలతికి ఎంపీపీగా అవకాశం కల్పించారు. మాలతి సాధారణ కూలి. ఈమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు. టిడిపి నాయకులు ఎలకాటూరు సెగ్మెంట్ నుంచి మాలతిని పోటీల్లోకి దించారు. ఇదే మండలంలో మరో ఎస్టీ మహిళ కూడా గెలిచారు. ఇద్దరు చెరి రెండున్నర సంవత్సరాలు పదవిని పంచుకోవాలని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే భాను ప్రకాష్ సూచించారు.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో జడ్పీ పీఠం సామాన్య దళిత మహిళకు కేటాయించారు. గంపలగూడెం జనరల్ జడ్పిటిసి స్థానం నుంచి గెలిచిన కోట పుల్లమ్మకు జడ్పీ చైర్ పర్సన్ పదవిని టిడిపి కేటాయించింది. గతంలో గంపలగూడెం సర్పంచ్ గా పుల్లమ్మ పనిచేశారు. ఎం టెక్ చదువుకొని.. ప్రవేటు ఉద్యోగం చేస్తున్న పుల్లమ్మ.. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేశారు. పుల్లమ్మ భర్త వెంకటేశ్వరరావు ఎంటెక్ వరకు చదువుకున్నారు. ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నారు. గతంలో పుల్లమ్మ తిరువూరు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో తొలి జడ్పీ చైర్ పర్సన్ గా పుల్లమ్మ రికార్డు సృష్టించబోతున్నారు.
జడ్పీ చైర్మన్ స్థానాలలో బీసీలకు.. ఎస్సీలకు 5.. ఎస్టీలకు ఒక టీడీపీ కేటాయించింది. జనరల్ కేటగిరిలో 9.. ముస్లింలకు ఒక పదవి ఇచ్చింది. వైస్ చైర్మన్ స్థానాలలో బీసీలకు 11 పదవులు కేటాయించింది టిడిపి. ఎస్సీలకు ఒకటి.. రెండు వైస్ చైర్మన్లు కేటాయించారు. జనరల్ కేటగిరిలో నాలుగు.. ముస్లింలకు రెండు వైస్ చైర్మన్ స్థానాలు ఇచ్చింది. మొత్తంగా మహిళలకు 12 మంది చైర్ పర్సన్లు.. 11 మంది వైస్ చైర్ పర్సన్ స్థానాలను కేటాయించారు. జనసేనకు చైర్మన్లను కేటాయించిన జిల్లాలలో టిడిపి నేతలకు వైస్ చైర్మన్ పదవులు లభించాయి. టిడిపి జెడ్పీ అభ్యర్థుల జాబితాలో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి.. పిల్లి అనంతలక్ష్మి. హేమలత.. పోలం రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించింది. మాజీ ఎమ్మెల్సీ పుత్త నరసింహారెడ్డికి జడ్పీ ఛైర్మన్గా అవకాశం కల్పించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారసులకు కూడా అవకాశం కల్పించింది. వీరిలో మజ్జి సిరి సహస్ర.. వీరేష్ చంద్ర దేవ్.. గొల్లపల్లి అమూల్య.. చింతమనేని సాయి నవ్యశ్రీ.. నల్లపాటి కీర్తన.. కందుల రామిరెడ్డి.. సుగవాసి ప్రసాద్ బాబు.. పరిటాల శ్రీరామ్ కు చోటు కల్పించింది.
