
అనకాపల్లి: స్థానిక జీవీఎంసీ మెయిన్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న కె. లతిక్ కుమార్ జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నాడు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మాజీ మాట్లాడుతూ, విద్యార్థి లతిక్ కుమార్ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విద్యార్థి ప్రతిభను గుర్తించి శిక్షణ అందించిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.వి. నరసింహంను అభినందించారు.
అనంతరం ప్రధానోపాధ్యాయులు బ్రహ్మాజీ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, విద్యార్థి తల్లిదండ్రులు లతిక్ కుమార్ను అభినందించి, జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
