అనకాపల్లి: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 110వ వార్డులో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని వేల్పుల వీధి, పరిసర ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతి కుమారితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థుల తరఫున ప్రజలకు ఎన్నికల ప్రచార వివరాలను వివరిస్తూ, తమ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలపై ప్రజలతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో 110వ వార్డుకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





