Home క్రైమ్ చైల్డ్ బిహేవియర్: బాల ఉన్మాదులను.. దారిలో పెట్టేది ఎవరు? – Andhra Waves

చైల్డ్ బిహేవియర్: బాల ఉన్మాదులను.. దారిలో పెట్టేది ఎవరు? – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


చైల్డ్ బిహేవియర్: పాఠశాల అంటే.. చదువులకు చిరునామా.. పిల్లల మాటలు.. ఆటలు.. పాటలు వంటి వాటితో విలసిల్లే పవిత్రమైన ప్రాంతం. అటువంటి పాఠశాలలు దారుణంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. అమాయకమైన పిల్లలపై తోటి విద్యార్థులు దారుణమైన దాడులకు దిగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. హర్యాన రాష్ట్రంలో పంచకుల ప్రాంతంలో తాజాగా జరిగిన ఘటన మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని.. పిల్లల ఆలోచన తీరును ఎత్తిచూపుతోంది. హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో సెక్టార్ […]

పిల్లల ప్రవర్తన: పాఠశాల అంటే.. చదువులకు చిరునామా.. పిల్లల మాటలు.. ఆటలు.. పాటలు వంటి వాటితో విలసిల్లే పవిత్రమైన ప్రాంతం. అటువంటి పాఠశాలలు దారుణంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. అమాయకమైన పిల్లలపై తోటి విద్యార్థులు దారుణమైన దాడులకు దిగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. హర్యాన రాష్ట్రంలో పంచకుల ప్రాంతంలో తాజాగా జరిగిన ఘటన మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాన్ని.. పిల్లల ఆలోచన తీరును ఎత్తిచూపుతోంది.

హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో సెక్టార్ 20 లో సంస్కృతి మోడల్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలలో జరిగిన సంఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇక్కడ కేజీ చదువుతున్న ఒక చిన్నారిపై.. ఇదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఒక బాలుడు ఇటుకరాలతో దారుణంగా దాడి చేశాడు. బాలుడు చేసిన దాడుల వల్ల ఆ పాప స్పృహ కోల్పోయింది. ఆ పాపను ప్రస్తుతం ఒక ఆసుపత్రికి చికిత్స. అతడు చేసిన దాటికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల ద్వారా బయటికి రావడంతో.. వాస్తవం ఏంటనేది.

ఇక రాప్తాడులో పదవ తరగతి చదివే విద్యార్థిని మీద.. ఒక యువకుడు గదిలో అందరూ చూస్తుండగానే రంపం తో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తెగిపోయింది. ముఖం మీద తీవ్రంగా గాయాలు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రేమకు నిరాకరించడం వల్లే అతడు ఈ స్థాయిలో దారికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపాల్ ను అదే పాఠశాలలో చదివే విద్యార్థులు అత్యంత దారుణంగా చంపేశారు. ఆమె దగ్గర ఉన్న డబ్బులను దొంగిలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించింది.

నిజంగా చిన్న పిల్లలు ఇలా మారిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని సైకాలజిస్టులు అంటున్నారు. ఈ విపరీత ధోరణికి అడ్డుగడ్డ వేయాలంటే పోలీసు కేసులు మాత్రమే సరిపోవని చెబుతున్నారు. తల్లిదండ్రులు.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఉమ్మడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజు సమయం కేటాయించాలని.. వారితో మాట్లాడాలని.. వారి మాట తీరును పరిశీలించాలని.. పాఠశాలలో వారికి ఎదురైనా అనుభవాలు.. స్నేహితుల గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలకు మొబైల్ ఫోన్ ఇచ్చేటప్పుడు.. వారు చూస్తున్న కంటెంట్.. ఆడుతున్న గేమ్‌లపై నిరంతరం నిఘా ఉంచాలని చెబుతున్నారు. హింసాత్మకమైన ఆటలకు దూరంగా ఉండేలా చేయాలి. ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అందించాలని.. కోపాన్ని కాకుండా.. ప్రేమతో వారిని దగ్గరకు తీసుకోవాలని సూచించారు. మార్కులు.. ర్యాంకులు కాకుండా.. మానవీయకోణం.. ఇతరులను గౌరవించడం.. తోటి వారి మీద దయ ఉంటే వాటి లక్షణాలను పెంపొందించాలని సూచిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird