
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమయం, సందర్భం కల్పించుకుని మరీ చంద్రబాబు విజనరీనీ, పాలనా దక్షతనూ ప్రస్తుతిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కేటీఆర్ గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ద్రోహిగా అభివర్ణించారు.
జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును స్కిల్ కేసు అంటూ అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా హైదరాబాద్ లో ఆందోళనకు దిగిన టెక్కీలను తప్పుపట్టారు. ఆ ఆందోళనను అణచివేయడానికి శతధా ప్రయత్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్, ఏపీలో జగన్ సర్కార్ పతనమైన తరువాత కూడా ఆయన చంద్రబాబుపై పలు విమర్శలు గుప్పించారు. వైసీపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులపై, రేవంత్ సర్కార్ పని తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఏపీలో తెలంగాణ కంటే తీవ్రమైన కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి, చంద్రబాబు అత్యంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే కరువు ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న కేటీఆర్‌లో లోటు వర్షపాతం కనిపిస్తుంది, చంద్రబాబు సర్కార్ నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతులను, ప్రజలను ఆదుకుంటోంది.
అదే సమయంలో తెలంగాణలో పుష్కలంగా నీరు అనుకూలంగా, ప్రణాళికలోపం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై స్వయంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారంటూ పలు వ్యాఖ్యలను గుర్తుచేశారు. పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచార అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్న భావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.
[KTR Praises Chandrababu Naidu, Political, Importance, Jagan, Ycp, Telangana politics, Revanth Reddy, Drought Management, Telugu One]
