Home Uncategorized 110వ వార్డు అభివృద్ధికి కూటమి అభ్యర్థి తాడి శాంతకుమారికి మద్దతు ఇవ్వండి

ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

110వ వార్డు అభివృద్ధికి కూటమి అభ్యర్థి తాడి శాంతకుమారికి మద్దతు ఇవ్వండి

ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

by andhra andhrawave
0 comments

అనకాపల్లి: పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో 110వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతకుమారికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

గత ఐదేళ్ల పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో వైద్యుల సంఖ్యను 17 నుంచి 43కు పెంచామని, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షలు, ఆపరేషన్ థియేటర్ల వంటి ఆధునిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రూ.22 కోట్లతో అదనంగా 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 280 పడకలున్న ఆసుపత్రిని 400 పడకలకు విస్తరించే ఆలోచన ఉందని వివరించారు.

విద్యారంగంలో తల్లికి వందనం పథకంతో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టణంలో రహదారులు, వీధి దీపాలు, పార్కులు, శారదా ఘాట్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అనకాపల్లి పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొంటూ, 110వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి తాడి శాంతకుమారికి గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird