అనకాపల్లి: జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ 109వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయరామరాజుపేట వీధులు, పరిసర ప్రాంతాల్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులతో మమేకమై కూటమి అభ్యర్థి తరఫున ఓట్లు అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్రతో పాటు 109వ వార్డుకు చెందిన కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




