Home ఆంధ్రప్రదేశ్ Ananth Sriram: సర్పంచ్ గా తల్లి ఏకగ్రీవం.. సొంత ఊరికి – Andhra Waves

Ananth Sriram: సర్పంచ్ గా తల్లి ఏకగ్రీవం.. సొంత ఊరికి – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Ananth Sriram:విలక్షణమైన పాటలు రాస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఈయన కుటుంబంలో ఇప్పుడు ఆనందం తాండవిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరి రామ జోగయ్యకు అనంత్ శ్రీరామ్ దగ్గర బంధువు అవుతారు. ఇప్పుడు హఠాత్తుగా అనంత్ శ్రీరామ్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే.. ఇటీవల ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనంత్ శ్రీరామ్ మాతృమూర్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అది కూడా ఏకగ్రీవంగా.. […]

అనంత్ శ్రీరామ్:విలక్షణమైన పాటలు రాస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్. ఈయన కుటుంబంలో ఇప్పుడు ఆనందం తాండవిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకుడు చేగొండి హరి రామ జోగయ్యకు అనంత్ శ్రీరామ్ దగ్గర బంధువు అవుతారు. ఇప్పుడు హఠాత్తుగా అనంత్ శ్రీరామ్ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే.. ఇటీవల ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనంత్ శ్రీరామ్ మాతృమూర్తి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అది కూడా ఏకగ్రీవంగా..

అనంత్ శ్రీరామ్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల. ఈ గ్రామంలో ఆయన తల్లి చేగొండి ఉమారాణి సర్పంచ్ గా పోటీ చేశారు. అయితే ఊరంతా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎలమంచిలి మండలంలో మొత్తం 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అందులో దొడ్డిపట్ల ఒకటి. తన తల్లి ఉమారాణి ఏకగ్రీవం కావడంతో అనంత్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. దీనికోసం సహకరించిన గ్రామ పెద్దలకు.. ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

అనంత్ శ్రీరామ్ తల్లిదండ్రులు ఉమారాణి.. వీర వెంకట సత్యనారాయణమూర్తి జనసేనలో చేరారు. దొడ్డిపట్ల సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీనితో తన మాతృమూర్తికి అవకాశం ఇవ్వబడింది అనంత్ శ్రీరామ్ పార్టీ ముఖ్య నేతలను. నామినేషన్ ప్రక్రియ పోటీకి ఇతర వ్యక్తులు ఆసక్తి చూపించారు.. గ్రామ పెద్దలతో శ్రీరామ్ స్వయంగా చర్చలు జరిపారు. ఏకగ్రీవానికి ఒప్పించారు. దాదాపు స్వగ్రామంలో ఐదు రోజులపాటు ఉన్నారు. అందరిని సమన్వయం చేశారు. అనుకున్నది సాధించారు.

ఎన్నికలు దొడ్డిపట్ల గ్రామ అభివృద్ధి కోసం ఆనంద్ శ్రీరామ్ 40 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకాలు.. అభివృద్ధి నిధులకు తోడుగా.. తనవంతుగా తొలి విడుతలో 20 లక్షలు ఇస్తానని.. మిగిలిన విడతలో దఫ దఫాలుగా డబ్బులు ఇస్తానని ఆయన ప్రకటించినట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమా పాటలతో శ్రోతలను అలరిస్తున్న అనంత్ శ్రీరామ్.. తన తల్లిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా గెలిపించుకోవడానికి ముందుకు వచ్చారు. గ్రామం అభివృద్ధి కోసం నిధిని కూడా కేటాయించారు. మొత్తంగా దొడ్డిపట్లలో తన తల్లిని గెలిపించుకొని.. తన సత్తా ఏమిటో చూపించారు అనంత్ శ్రీరామ్. భవిష్యత్తులో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే సారి జరిగే ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉందని సన్నిహితులు చర్చించుకుంటున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird