ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు:వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెప్తారు గుర్తుందా.. సేమ్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూటమి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని జోరు చూపిస్తోంది. ఏకపక్షంగా ఎన్నికల జరిగింది వైసీపీ రకరకాలుగా ప్రచారం చేసినప్పటికీ.. పులివెందుల లాంటి ప్రాంతంలో రీ పోలింగ్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. […]
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు:వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అని బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెప్తారు గుర్తుందా.. సేమ్ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూటమి పరిస్థితి కూడా అలానే ఉంది. ఇటీవల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని జోరు చూపిస్తోంది. ఏకపక్షంగా ఎన్నికల జరిగింది వైసీపీ రకరకాలుగా ప్రచారం చేసినప్పటికీ.. పులివెందుల లాంటి ప్రాంతంలో రీ పోలింగ్ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. కృష్ణాజిల్లా పెడన మున్సిపల్ చైర్ పర్సన్ గా జనసేన అభ్యర్థి జ్యోత్స్నారాణి ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి.. వైసిపి అభ్యర్థి మీద ఏకంగా 4380 ఓట్ల తేడాతో విజయం సాధించారు.. మొత్తంగా ఏపీలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో 10 స్థానాల్లో లీడ్ కూటమి ఉంది. మిగిలిన మూడు కూడా కూటమి ఖాతాలో పడే అవకాశం ఉంది. ఇక 87 మున్సిపాలిటీలలో.. 71 దాదాపుగా కూటమి ఖాతాలోకి వచ్చినట్టే. మిగిలినవి కూడా కూటమికే అవకాశం ఉంది. ఇందులో ఇప్పటివరకు 20 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. 44 స్థానాల్లో లీడ్ లో ఉంది. ఇతర మూడు స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. వైసిపి ఐదు స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది.
సూళ్లూరుపేట మున్సిపాలిటీలో టిడిపి 26 స్థానాలు దక్కించుకుంది. బిజెపి రెండు స్థానాలలో విజయం సాధించింది. జనసేన ఒక స్థానంలో గెలుపు అందుకుంది. వైసిపి మూడు స్థానాల్లో విజయం సాధించింది.
జగ్గయ్యపేట మున్సిపాలిటీ కూటమి దక్కించుకుంది. ఇక్కడ టిడిపికి 14 స్థానాలు వచ్చాయి. జనసేనకు ఐదు స్థానాలు వచ్చాయి. బిజెపికి ఒక స్థానం వచ్చింది. వైసిపి మూడు స్థానాలను సొంతం చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక స్థానం దక్కించుకున్నారు.
పుత్తూరు మున్సిపాలిటీ కూటమి సొంతం చేసుకుంది. టిడిపికి 26.. బిజెపికి రెండు.. జనసేనకు ఒకటి.. వైసీపీకి మూడు స్థానాలు వచ్చాయి
వెంకటగిరి.. గుత్తి.. పెనుకొండ మునిసిపాలిటీ స్థానాలు కూటమి సొంతమయ్యాయి.
కుప్పం మున్సిపాలిటీ టిడిపి దక్కించుకుంది. చివరికి బ్యాలెట్ ఓట్లలో కూడా కూటమి హవా కొనసాగింది. మొత్తం 99% మున్సిపాలిటీలలో పంపిణీ బ్యాలెట్ ఓట్లలో టిడిపి అనుబంధం కొనసాగింది. ఉద్యోగులు మొత్తం టిడిపికి జై కొట్టారు. తిరుపతి.. చిత్తూరు కార్పోరేషన్ బ్యాలెట్లలో టిడిపి లీడ్ కొనసాగింది. ఉయ్యూరు.. పెడన మున్సిపాలిటీ బ్యాలెట్లలో వైసిపి కాస్త లీడ్ కొనసాగింది. తిరువూరు.. మడకశిర.. అమలాపురం.. నర్సాపురం నగదు బ్యాలెట్ లో జనసేన లీడ్ చూపించింది.
మిగిలిన స్థానాలకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే లీడ్ ఫిగర్స్ మాత్రమే తేడాగా ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుందని టిడిపి నేతలు చెబుతున్నారు. అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రజలకు అందజేసే సంక్షేమం.. కష్టకాలంలో అండగా ఉంటున్న తీరు.. ఇవన్నీ కూడా కూటమికి ప్రజల జేజేలు పలకడానికి కారణం అవుతున్నాయని నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ ఈ ఫలితాల నుంచి చాలా నేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగడం కాదని.. ఓటు వేయకుండా వెళ్లిపోవడం కాదని.. క్షేత్రస్థాయిలో కలబడి నిలబడాలని.. అప్పుడే జనాలు హారతులు ఇస్తారని కూటమినేతలు చెబుతున్నారు. అలా కాకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేస్తా.. రప్ప రప్ప పరిపాలన సాగిస్తా అంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని కూటమినేతలు చెబుతున్నారు. ఏపీలో 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమికి ఏకంగా 164 స్థానాలు వచ్చాయి. ఇప్పటిస్థానిక ఎన్నికల్లో అంతకుమించిన స్థాయిలో ఫలితాలు వస్తున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు.
