Home Latest News పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.! | సైబరాబాద్ సైబర్ ​​క్రైమ్ | వైవాహిక మోసం | Instagram | క్రెడిట్ కార్డ్ | సైబర్ క్రైమ్ | సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | లవ్‌చీట్ – Andhra Waves

పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.! | సైబరాబాద్ సైబర్ ​​క్రైమ్ | వైవాహిక మోసం | Instagram | క్రెడిట్ కార్డ్ | సైబర్ క్రైమ్ | సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | లవ్‌చీట్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నకిలీ ఖాతా సృష్టించి, తాను వైద్యుడినంటూ పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నుంచి రూ.10.05 లక్షలు కాజేసిన సైబర్ మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో నిందితుడు జాజుల గుణవంత్‌తో అతనికి సహకరించిన తల్లి పాటూరి సురేఖను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు ఉన్నారు. బాధితురాలి నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని నగదు, బంగారు ఆభరణాలు, క్రెడిట్ కార్డు రుణం రూపంలో భారీగా సొమ్ము దండుకున్న తీరు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం మేరకు నిందితుడు జాజుల గుణవంత్ గిటారిస్ట్, మోడల్‌కు సంబంధించిన ఫొటోలతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ రూపొందించాడు. ఆ ప్రొఫైల్ ద్వారా 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో పరిచయం పెంచుకుని, తాను డాక్టర్‌ని నమ్మించాడు. మాటలతో మాయ చేసి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో బాధితురాలు అతడి మాటలను పూర్తిగా నిజమని నమ్మింది.

వివాహ బంధంపై విశ్వాసం కలిగిన తర్వాత నిందితుడు దశలవారీగా ఆర్థిక మోసానికి తెరలేపాడు. ఇంట్లో అత్యవసర పరిస్థితులు తలెత్తాయని చెబుతూ బాధితురాలు నుంచి పలు దఫాలుగా డబ్బులు వసూలు చేశాడు. అదనంగా, బంగారు ఆభరణాలను రాపిడో కొరియర్ సేవ ద్వారా పంపించాలని ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. మరోవైపు బాధితురాలికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి రూ.2.16 లక్షల రుణాన్ని పొందాడు.

ఈ మొత్తం మోసంలో నిందితుడి తల్లి పాటూరి సురేఖ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి సంబంధం నిజమేనని బాధితురాలురాలిని నమ్మిస్తూ కుమారుడి మోసాలకు అండగా నిలిచారు. అయితే తనకు జరిగిన మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గుణవంత్‌తో పాటు అతని తల్లిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి:

నిందితుడి నుంచి సేకరించిన సమాచారం మేరకు బంజారాహిల్స్‌లోని గుప్తా ఆర్ట్స్ అండ్ జ్యువెస్‌లో తాకట్టు పెట్టిన 20 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో జాజుల గుణవంత్‌పై గతంలోనూ 20 లక్షల రూపాయల మ్యాట్రిమోనియల్ మోసం కేసులో ఆరోపణలు తేలింది. ఈ కేసులో మరో నిందితుడు, గుణవంత్ బంధువైన బొరుగుంట లోకేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మీకు నచ్చవచ్చు:

[Cyberabad Cyber ​​Crime, Matrimonial Fraud, Instagram, credit card, Cybercrime, SoftwereEngineer, LoveCheat, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird