Home ఆంధ్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి: జగన్ బెంగళూరులో.. నాయకులు – Andhra Waves

జగన్ మోహన్ రెడ్డి: జగన్ బెంగళూరులో.. నాయకులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


జగన్ మోహన్ రెడ్డి:ఏపీలో స్థానిక ఎన్నికలు వైసిపి పరిస్థితి మరోసారి బయటపెట్టింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఆ ఓటమి ఎదురైన నాటి నుంచి కేవలం ఈవీఎంల మీద ఆరోపణలు చేసుకుంటూ వచ్చిన వైసిపి ఎన్నికలు.. బ్యాలెట్ విధానంలో జరిగితే ఏకపక్షంగా విజయాలు సాధిస్తామని అప్పట్లో చెప్పింది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి మొదలుపెడితే కిందిస్థాయి నాయకులు వరకు పదేపదే బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఎన్నికల గురించి […]

జగన్ మోహన్ రెడ్డి:ఏపీలో స్థానిక ఎన్నికలు వైసిపి పరిస్థితి మరోసారి బయటపెట్టింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. అయితే ఆ ఓటమి ఎదురైన నాటి నుంచి కేవలం ఈవీఎంల మీద ఆరోపణలు చేసుకుంటూ వచ్చిన వైసిపి ఎన్నికలు.. బ్యాలెట్ విధానంలో జరిగితే ఏకపక్షంగా విజయాలు సాధిస్తామని అప్పట్లో చెప్పింది. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి మొదలుపెడితే కిందిస్థాయి నాయకులు వరకు పదేపదే బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఎన్నికల గురించి మాట్లాడేవారు. ఆ విధానంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే వైసీపీ గెలుస్తుందని సవాల్ విసిరేవారు.

బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికల్లో వైసిపి విజయం కాదు కదా.. కనీసం కూటమికి సవాల్ విసిరే స్థాయిలో కూడా స్థానాలు సంపాదించుకోలేక. పార్టీకి బలమైన కార్యవర్గం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేసే నాయకులు లేకపోవడంతో వరుసగా ఓటములు ఎదుర్కొంటున్నారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం వల్ల వైసిపి పరిస్థితి దారుణంగా మారిపోయింది..

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు చూసినా బెంగళూరులోనే ఉంటున్నారు. చుట్టపు చూపుగా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులను ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే కలుస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే.. ఎవరైనా నాయకుడు అరెస్ట్ అయితే మాత్రమే ఆయన పరామర్శ యాత్ర చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ బెంగళూరు వెళుతున్నారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి.. వైయస్ అవినాష్ రెడ్డి.. ఇంకా కొంతమంది నాయకులకు మాత్రమే జగన్ టచ్ లో ఉంటున్నారు. జగన్ తో మాట్లాడాలి అనుకుంటే.. సజ్జల లేదా అవినాష్ కు చెప్పాలి. అయితే సజ్జల, అవినాష్ అపాయింట్‌మెంట్ దొరకడం అంత ఈజీ కాదు.

జగన్ బెంగళూరులో ఉండటం.. కీలకమైన నాయకులు హైదరాబాదులో ఉంటుండటంతో పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు భరోసా లేకుండా పోతోంది. అధికారంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలను జగన్ తెలుసుకునేవారు కాదు. సమస్యలు ఉండే ఆయన దృష్టికి వెళ్లకుండా నాయకులు మసిపోసి మారేడు కాయ చేసేవారు. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు పరిష్కారం కాకపోగా.. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పట్టించుకునే వారు లేకపోవడంతో కార్యకర్తల ఆవేదన అరణ్య రోదనగా మారింది. అందుకే వైసీపీకి స్థానిక ఎన్నికల్లో దారుణంగా సీట్లు వచ్చాయి. మొదట్లో ఈవిఎంల మీద ఆరోపణలు చేసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు బ్యాలెట్ విధానంలో కూడా దారుణమైన ఫలితాలు రావడంతో.. ఎవరిపైనా ఆరోపణలు తెలియక.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం అలా చేస్తే వైసీపీ ఆ స్థానాల్లో ఎలా గెలుస్తుంది? పాపం ఈ ప్రశ్నకు సమాధానం వైసీపీ కార్యకర్తలు చెప్పలేరు. ఎందుకంటే ఏపీలో జరిగిన ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్య విధానంలో జరిగాయి కాబట్టి..



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird