ప్రముఖ టెక్ ఒప్పో కొత్త ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఒప్పో కొత్త ప్యాడ్ 6 F లైట్ ఎడిషన్ పేరుతో ఈ డివైజ్‌ను రొమేనియాలోని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. ఇందులో 12.6 LCD డిస్ప్లే ఇచ్చారు. 2400 x 1600 పిక్సెల్స్ 2.4K రిజల్యూషన్, 3:2 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. అవసరాన్ని బట్టి 60Hz లేదా 90Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 720 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఎక్కువసేపు స్క్రీన్ చూసేవారికి కళ్లపై ఒత్తిడి తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.
ఈ ట్యాబ్లెట్‌లో మీడియాటెక్ హీలియో G200-ఆల్ట్రా ప్రాసెసర్ ఇచ్చారు. దీనికి 4GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ జత చేయబడింది. స్టోరేజ్‌ను మెమరీ కార్డు ద్వారా పెంచుకునే సదుపాయం కూడా ఉంది. ColorOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కొన్ని ఇతర నివేదికలలో 17 ప్రస్తావన ఆండ్రాయిడ్, ఒప్పో అధికారిక స్పెసిఫికేషన్లలో ColorOS 17 అని గుర్తించబడింది. స్టైలస్ సపోర్ట్ కూడా ఉంది. ఒప్పో పెన్సిల్ 2Rto నోట్స్ రాయడం, డ్రాయింగ్ చేయడం వంటి పనులు చేసుకోవచ్చు.
ఈ ట్యాబ్లెట్‌లో 11,000mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అదనంగా 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. అంటే కేబుల్ ద్వారా ఇతర అనుకూల డివైజ్‌లకు కూడా ఛార్జింగ్ అందించవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 16.2 గంటల వరకు వీడియోలు చూడొచ్చని కంపెనీ చెబుతోంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 129 నిమిషాలు పడుతుందని.
కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 8MP కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసుల కోసం 5MP కెమెరా ఉంది. రెండు కెమెరాలతోనూ 1080p రిజల్యూషన్‌లో 30fps వీడియోలు రికార్డ్ చేయొచ్చు. సౌండ్ కోసం నాలుగు అందించారు. వై ఫై 5, బ్లూటూత్ 5.4, USB టైప్-C కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. Facebook అన్‌లాక్ సదుపాయం కూడా ఉంది. ట్యాబ్లెట్ మందం 6.52 మిల్లీమీటర్లు కాగా, బరువు 618 గ్రాములు. IP42 రేటింగ్ ఉండటంతో పరిమిత స్థాయిలో దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ లభిస్తుంది.
ప్రస్తుతం ఒప్పో ప్యాడ్ 6 F లైట్ ఎడిషన్ ను కంపెనీ రొమేనియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్రాస్ట్ సిల్వర్ రంగులో జాబితా చేసింది. అయితే ధర, విక్రయాలు ప్రారంభమయ్యే తేదీని ఇంకా ప్రకటించలేదు. భారత్‌లో ఈ ట్యాబ్లెట్ విడుదలపై కూడా అధికారిక సమాచారం లేదు.
The post ఈ ట్యాబ్లెట్ కొంటే ల్యాప్ ట్యాప్ అవసరం లేదు appeared first on iDreamPost.
