Home ఆంధ్రప్రదేశ్ YSRCP: చిన్న చిన్న విజయాలతోనే వైసిపి సంతృప్తి.. పాపం – Andhra Waves

YSRCP: చిన్న చిన్న విజయాలతోనే వైసిపి సంతృప్తి.. పాపం – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YSRCP: ఏపీ రాజకీయాలలో వైసిపి పరిస్థితి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ఏదైనా ఘోర పరాజయం నుంచి బయట పడేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్‌లో అక్కడ లభించే విజయాలను కూడా పెద్ద రాజకీయ విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నది ఆ పార్టీ. కొన్ని పంచాయితీలు.. వార్డులు లేదా డివిజన్లలో సాధించిన విజయాలు రాష్ట్రవ్యాప్తంగా దక్కిన ఆదరణగా సంకేతాలు ఇస్తున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్న మార్పు గతంలో రాష్ట్ర […]

YSRCP: ఏపీ రాజకీయాలలో వైసిపి పరిస్థితి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. గత ఎన్నికల్లో ఏదైనా ఘోర పరాజయం నుంచి బయట పడేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్‌లో అక్కడ లభించే విజయాలను కూడా పెద్ద రాజకీయ విజయాలుగా ప్రచారం చేసుకుంటున్నది ఆ పార్టీ. కొన్ని పంచాయితీలు.. వార్డులు లేదా డివిజన్లలో సాధించిన విజయాలు రాష్ట్రవ్యాప్తంగా దక్కిన ఆదరణగా సంకేతాలు ఇస్తున్నాయి.

ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్న మార్పు

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ శక్తిగా ఉన్న వైసిపికి ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ రాజకీయ పరిస్థితిని మార్చేశాయి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన పై చర్చ జరుగుతుంది. పంచాయతీలు.. మున్సిపాలిటీలు.. మండల పరిషత్ లు.. జిల్లా పరిషత్ లలో వచ్చిన ఫలితాలపై పార్టీ బలాబలాలపై స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల లభించిన విజయాలు మాత్రమే ప్రస్తావిస్తూ… మొత్తం ఎన్నికల ఫలితాలు పక్కన పెడుతున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఓట్ల శాతం.. స్థానాల సంఖ్య వంటి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది.

క్యాడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నమా

వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు వైసిపి కార్యకర్తలపై ప్రభావం చూపుతున్నాయి. నాయకులు పార్టీని విడిపోవడం.. క్షేత్రస్థాయిలో ఉత్సాహం తగ్గింది అనే ప్రచారానికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి విజయాలను కూడా ప్రత్యేకంగా ప్రచారం చేయడం ద్వారా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపాలని నాయకత్వం కోసం రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ఇంకా రాజకీయ పోటీలో కొనసాగుతోంది. క్యాడర్‌లో నిరాశ పెరగకుండా చూడడమే ఈ ప్రచారాల వెనుక ఉద్దేశమని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి…

ఆత్మ పరిశీలన అవసరం

ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత అవసరం. ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారు.. ఏ ప్రాంతాల్లో పార్టీ బలహీనపడింది.. నాయకత్వంపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది. పరిమిత విజయాలు మాత్రమే ప్రధానంగా చూపిస్తూ పార్టీ బలాన్ని అంచనా వేసుకుంటే అసలు సమస్యలు గుర్తించడం కష్టమైపోతుంది. సోషల్ మీడియా ప్రచారాలు.. రాజకీయ ప్రకటనలతో కార్యకర్తల్లో తాత్కాలిక ఉత్సాహం వస్తుంది. కానీ ప్రజల మద్దతును తిరిగి పొందాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గత ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ప్రజల్లో విశ్వసాన్ని పునరుద్ధరించుకునే దిశగా వైసిపి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. స్థానికంగా సాధించిన విజయాలను ప్రచారం చేయడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird