Tirupparankundram Deepam : తమిళనాడులోని తిరుప్పరం కుండ్రం మరోసారి వార్తల్లో నిలిచింది. కొండపై ఉన్న దీప స్థంభం వద్ద ఆనందం దీపం వెలిగించడంతో భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. దీపం వెలిగిన క్షణం నుంచి కొండ పరిసరాలు హర హర మహాదేవ నామస్మరణతో మారుమోగిపోయాయి. వేలాదిమంది భక్తులు ఈ ఘట్టాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. చాలా కాలంగా తమ ఆకాంక్ష నెరవేరిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొండపైకి పూలు వెదజల్లుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. కొంతమంది […]
Tirupparankundram Deepam : తమిళనాడులోని తిరుప్పరం కుండ్రం మరోసారి వార్తల్లో నిలిచింది. కొండపై ఉన్న దీప స్థంభం వద్ద ఆనందం దీపం వెలిగించడంతో భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. దీపం వెలిగిన క్షణం నుంచి కొండ పరిసరాలు హర హర మహాదేవ నామస్మరణతో మారుమోగిపోయాయి. వేలాదిమంది భక్తులు ఈ ఘట్టాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు.
చాలా కాలంగా తమ ఆకాంక్ష నెరవేరిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కొండపైకి పూలు వెదజల్లుతూ తమ ఆనందాన్ని చాటుకున్నారు. కొంతమంది భక్తులు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టారు. దీపం వెలిగిన సందర్భాన్ని ఒక పండుగలాగా జరుపుకున్నారు.
ఈ వ్యవహారపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. దీప స్తంభం వద్ద దీపం వెలిగించే అంశం న్యాయపరమైన పోరాటానికి దారితీసింది. ఈ నేపథ్యంలో దీపం వెలిగించడంతో న్యాయపోరాటంలో విజయం సాధించామని భావించిన భక్తులు భారీగా బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
తిరుప్పరం కుండ్రం కొండపై దీపం పెరిగిన దృశ్యాలు.. భక్తుల ఆనందోత్సాహాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన ఘట్టం సాక్షారం కావడంతో భక్తుల్లో కనిపించిన ఆనందం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొండమీద దీపం వెలిగించడానికి ప్రత్యేకంగా 30 కేజీల నెయ్యి కింది నుంచి తీసుకెళ్లారు. 50. కిలో ఖాదీ వస్త్రాన్ని.. ఐదు కిలోల కర్పూరాన్ని.. ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు. ఆ దీప స్తంభానికి వస్త్రం చుట్టారు. నెయ్యి పోసి సిద్ధం చేశారు. సరిగ్గా ఐదు గంటలకు వేరాది భక్తుల కేరింతల మధ్య కొండపై దీపాన్ని వెలిగించారు. కొండపై దీపం వెళ్ళిన తర్వాత చాలామంది భక్తులు హర హర మహాదేవ అంటూ నినాదాలు చేశారు. కొంతమంది భక్తులు ఆనందాన్ని చూసి తట్టుకోలేక ఏడ్చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో విజయ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. చూడు విజయ్.. నీ మూర్ఖత్వం వల్ల ఒకరోజు వాయిదా పడింది. కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చివరికి దీపాన్ని వెలిగించింది. ఈ దీపం వెలుగులో అయినా నీ అంధకారం తొలగిపోవాలని కోరుకుందాం.. సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
#WATCH | మదురై, తమిళనాడు: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తిరుపరంకుండ్రం కొండలోని దీపతూన్ రాతి స్తంభం వద్ద ఉత్సవంగా కార్తీక దీపం వెలిగించారు. https://t.co/FymnyKGmyE
— ANI (@ANI) నవంబర్ 28, 2026
