Home ఆంధ్రప్రదేశ్ అన్న క్యాంటీన్లు: నాడు కడప మాడింది.. నేడు ఆకలి తీరింది – Andhra Waves

అన్న క్యాంటీన్లు: నాడు కడప మాడింది.. నేడు ఆకలి తీరింది – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Anna Canteens:ఏ మనిషికైనా సరే ఆకలి అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆర్థిక స్తోమత ఆధారంగా తినే తిండి ఉంటుంది. డబ్బున్న వాళ్ళ విషయం కాస్త పక్కన పెడితే.. పేదలకు మాత్రం ఆకలి వేస్తే ఇబ్బంది తప్పదు. కొన్ని సందర్భాల్లో ఆకలికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటివారు ఆకలితో ఇబ్బంది పడకూడదని.. మానవతా దృక్పథంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 132 కోట్లు ఖర్చుపెట్టి.. ఏకంగా 5.16 కోట్ల భోజనాలను […]

అన్నా క్యాంటీన్లు:ఏ మనిషికైనా సరే ఆకలి అనేది ఒకే విధంగా ఉంటుంది. ఆర్థిక స్తోమత ఆధారంగా తినే తిండి ఉంటుంది. డబ్బున్న వాళ్ళ విషయం కాస్త పక్కన పెడితే.. పేదలకు మాత్రం ఆకలి వేస్తే ఇబ్బంది తప్పదు. కొన్ని సందర్భాల్లో ఆకలికి పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటివారు ఆకలితో ఇబ్బంది పడకూడదని.. మానవతా దృక్పథంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 132 కోట్లు ఖర్చుపెట్టి.. ఏకంగా 5.16 కోట్ల భోజనాలను పేదలకు పట్టించింది. 1. 83 లక్షల మంది ఆకలిని తీర్చింది. పేదలు.. నిరాశ్రయులు.. వంటి వారికి అన్న క్యాంటీన్లు అన్నపూర్ణగా మారాయి. కేవలం భోజనం విషయంలోనే కాకుండా.. పరిశుభ్రత పరంగా అత్యున్నత ప్రమాణాలను ఈ క్యాంటీన్లు పాటించాలి. పేదలకు.. బడుగు బలహీన వర్గాలకు అన్న క్యాంటీన్లు కొండంత అండగా నిలిచాయి. పరిశ్రమలలో పనిచేసే కార్మికులు.. రోజువారీ శ్రమజీవులు.. ఎంతోమంది ఆకలి బాధల నుంచి ఉపశమనం పొందారు.

2019లో అధికారులకు వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం పేదల అన్నం ముద్ద పైన కక్ష సాధింపు రాజకీయాలను ప్రదర్శించింది. ఆగస్టు 2019లో ఆహార సరఫరా ముగిసిపోయిన తర్వాత.. క్యాంటీన్ మొత్తం మూసివేసింది. పేదల కడుపు కొట్టింది. టిడిపి ముద్ర ఉండటంతో.. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలను రంగు మార్చింది. తాళాలు వేసి.. పడావు పెట్టింది. కొన్నిచోట్ల భవనాలను కూల్చివేసింది. ఆయా ప్రదేశాలుగా వార్డు సచివాలయా మార్చేసింది. కడప పురపాలక సంఘం వద్ద ఉన్న క్యాంటీన్‌ కూల్చివేసింది. విజయవాడ రాణి గారి తోట క్యాంటీన్ ను సచివాలయం లాగా మార్చింది. వెంకటగిరి.. ఉండవల్లి వంటి ప్రాంతాల్లో క్యాంటీన్లు చెత్తకుప్పలుగా మారిపోయాయి. పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారిపోయాయి. ఐదు సంవత్సరాలపాటు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దారుణంగా వదిలేసింది.

2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చింది. పాడైపోయిన భవనాలు మొత్తం కొత్త రూపు సంతరించుకున్నాయి. 2024 ఆగస్టు 15న మొదటి విడతలో 100.. ఆ తర్వాత సెప్టెంబర్ 203 నాటికి క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి.. మొత్తంగా 273 అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసింది. తీయడానికి 200 కోట్లకు పైగా నిధులు ఖర్చుపెడుతోంది. ప్రస్తుతం రోజుకు సగటున 2.73 లక్షల మందికి పైగా ఆకలి తీర్చుతూ.. మొత్తం 12.65 కోట్ల భోజనాలు అందిస్తూ.. విజయవంతంగా కొనసాగుతోంది. ఇదంతా కూడా పేదల పట్ల టిడిపికి ఉన్న మానవత్వానికి.. వైసిపి ప్రదర్శించిన అక్కసుకు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిని కూడా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird