తల్లీకొడుకుల మధ్య జరిగిన గొడవ.. గొడవతో అస్సలు సంబంధం లేని ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. తల్లితో గొడవ కారణంగా ఓ వ్యక్తి ఆగ్రహానికి కారణమయ్యాడు. మేడపై నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను కిందకు విసిరాడు. దీంతో కింద నిలబడి యువకుడి తలపై సిలిండర్ పడింది. ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనలో జరిగింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..
శివమ్ అనే వ్యక్తి తన తల్లితో శర్మ ఢిల్లీ, బిందాపూర్లోని ఓ భవనం మూడో అంతస్తులో ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం శివమ్ శర్మ, అతని తల్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురైన శివమ శర్మ నిండు ఎల్పీజీ గ్యాస్ సిలిండను మూడో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు విసిరేశాడు. ఆ సమయంలో భవనం బయట నిలబడి ఉన్న 30 ఏళ్ల సాహిల్ తలపై ఆ సిలిండర్ పడింది.
సాహిల్ అదే బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ ఉంటున్నాడు. సిలిండర్ నెత్తిన పడ్డంతో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సాహిల్‌ను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే సాహిల్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు శివమ్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. సిలిండర్ ప్రమాదవశాత్తు పడిందా లేక కావాలంటే విసిరేశారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

