వైఎస్ జగన్: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయ పురంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ కట్టడాల తొలగింపు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. కడప – రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలయ నిర్మాణాలను తొలగించడంతో వైసిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఘటనపై దృశ్యాలు.. హే రామ్.. ఆలయాన్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి అంటూ సోషల్ […]
వైఎస్ జగన్: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయ పురంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ కట్టడాల తొలగింపు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. కడప – రేణిగుంట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలయ నిర్మాణాలను తొలగించడంతో వైసిపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందిస్తూ.. హే రామ్.. ఆలయాన్ని కాపాడండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆలయ తొలగింపును వ్యతిరేకించారు.
మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇది ఆకస్మికంగా తీసుకుని నిర్ణయం కాదని.. జాతీయ రహదారి విస్తరణ కోసం చట్టబద్ధంగా చేపట్టిన భూ సేకరణ ప్రక్రియలో భాగం అని చెబుతోంది. ఆలయ విగ్రహాలను ముందుగానే ఆగమ సంప్రదాయాల ప్రకారం తరలించామని.. పరిహారం కూడా ఆలయ ఖాతాలో జమ చేశామని అధికారులు చెబుతున్నారు. దీంతో తొలగింపు ఆలయ వెనుక ఉన్న వాస్తవాలు.. వైసీపీ ఆరోపణలు.. ప్రభుత్వ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
కడప రేణిగుంట జాతీయ రహదారి 716 ను నాలుగు లైన్లుగా విస్తరించే ప్రాజెక్టులో భాగంగా ఆంజనేయ పురం వద్ద భూసేకరణ జరుగుతోంది. ఈ ప్రక్రియలో ఆలయానికి సంబంధించిన స్థలం కూడా రహదారి విస్తరణకు వచ్చింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఆలయానికి చెందిన 1,740.21 చదరపు మీటర్ల స్థలానికి సంబంధించి భూ సేకరణ జరిగింది. భూ సేకరణకు సంబంధించి 2023 అక్టోబర్ 24 తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ అవార్డు ప్రొసీడింగ్స్ జారీ చేశారు. భూసేకరణకు పరిహారంగా 59,30,606 రూపాయలు మంజూరయ్యాయి. ఈ వ్యక్తిగతంగా ఎవరికి చెల్లించకుండా.. ఆలయ కార్య నిర్వహణ అధికారి పేరుతో బ్యాంకులో ఎఫ్ డీ చేశారు.
ఆలయ కట్టడాల తొలగింపు పై వైసిపి చేస్తున్న రాద్ధాంతం నేపథ్యంలో.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ చెంపపెట్టు లాగా ఉంది. పాత నిర్మాణాల తొలగింపు ముందుగా బాలలయం ఏర్పాటు చేశారు. విగ్రహాలకు ధాన్యాధివాసం. తాత్కాలికంగా మరోచోట ప్రతిష్టించారు. అదే ప్రాంతంలో ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి 50 సెంట్లు ఆ ప్రభుత్వం కేటాయించింది.
వైసీపీ మాత్రం ఈ వివరాలను ఒప్పుకోవడం లేదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆలయాన్ని బుల్డోజర్లతో తొలగించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ఆలయాన్ని తొలగించాలని ఆరోపిస్తున్నారు. ఆలయ చారిత్రక ప్రాధాన్యతను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ వాదనలో ఆసక్తికరమైన అంశం భూసేకరణ ఎప్పుడు ప్రారంభమైనది.. ఆలయానికి సంబంధించిన భూసేకరణకు 2023 అక్టోబర్లోనే మరో అవార్డు ప్రొసీడింగ్స్ జారీ అయింది. అటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో అధికారం ఉంది.
తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ ప్రక్రియకు అవార్డు ప్రొసీడింగ్స్ జారి అయినప్పటికీ వైసీపీ దానిని దాటవేస్తోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. చంద్రబాబు వల్లే ఆలయాన్ని కూల్చివేశారని మండిపడుతోంది. వాస్తవాలను దాచి సొంత మీడియాలో అడ్డగోలుగా వక్రీకరణలు చేస్తున్నారు. అయితే దీనిని ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇవ్వడంతో వైసిపికి నోరు మెదపని పరిస్థితి. సమయం దొరికితే చాలు చంద్రబాబును.. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నది వైసిపి.
