Home ఆంధ్రప్రదేశ్ అమరావతి క్వాంటం వ్యాలీ: చంద్రబాబు సంకల్పం.. – Andhra Waves

అమరావతి క్వాంటం వ్యాలీ: చంద్రబాబు సంకల్పం.. – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Amaravati Quantum Valley: ఒకప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచం మరో కీలకమైన సాంకేతికతను అందిపుచ్చుకోబోతోంది. మార్పు దిశగా అడుగులు వేస్తోంది. దాని పేరే క్వాంటం కంప్యూటింగ్ (క్వాంటమ్ కంప్యూటింగ్). సాధారణ కంప్యూటర్లతో కొన్ని క్లిష్టమైన సమస్యలకు చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు వేగంగా సమస్యను పరిష్కరిస్తుంది. ఇలాంటి అత్యధిక సాంకేతికతలో […]

అమరావతి క్వాంటం వ్యాలీ: ఒకప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత ఇంటర్నెట్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలికాయి. ఇప్పుడు ప్రపంచం మరో కీలకమైన సాంకేతికతను అందిపుచ్చుకోబోతోంది. మార్పు దిశగా అడుగులు వేస్తోంది. దాని పేరే క్వాంటం కంప్యూటింగ్ (క్వాంటమ్ కంప్యూటింగ్).

సాధారణ కంప్యూటర్లతో కొన్ని క్లిష్టమైన సమస్యలకు చాలా సమయం పడుతుంది. కానీ క్వాంటం కంప్యూటర్లు వేగంగా సమస్యను పరిష్కరిస్తుంది. ఇలాంటి అత్యధిక సాంకేతికతలో ఏపీ రాజధాని అమరావతి క్యాపిటల్ గా అవతరించడానికి అడుగులు వేస్తోంది. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ నగరాన్ని ఐటి కి కేరాఫ్ అడ్రస్ లాగా మార్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక గుండెకాయ లాగా నిలిచింది. ఐటీ ద్వారా సింహభాగం ఆదాయం అటు కేంద్రానికి.. ఇటు రాష్ట్రానికి వస్తోంది. చంద్రబాబు దూర దృష్టి ఉంటుంది కాబట్టి హైదరాబాదులో ఆయన ఏర్పాటు చేసిన ఐటీ సంస్థలు భారీగా పన్నులను ప్రభుత్వాలకు అందజేస్తాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మార్చడానికి చంద్రబాబు అమరావతి క్వాంటం వ్యాలీ(అమరావతి క్వాంటం వ్యాలీ) అనే ప్రాజెక్టును చేపడుతున్నారు. దీనికోసం ఐబీఎం (IBM), టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్), ఎల్ అండ్ టి (L&T) వంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. గత ఏడాది మే రెండవ తేదీన ఈ సంస్థలతో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను ప్రదర్శించారు. ఇందులో ఐబిఎం క్వాంటమ్ సిస్టం టూ, 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ ను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ కంప్యూటర్ వ్యవస్థను నిపుణులు.. శాస్త్రవేత్తలు.. విద్యాసంస్థలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికను రూపొందించారు.

క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే

సాధారణ కంప్యూటర్లు బిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. వీటిలో ఒక బిట్ జీరో లేదా ఒకటి అనే రెండు స్థితులలో ఉంటుంది కానీ క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. క్వాంటం మెకానిక్స్ సాంప్రదాయక పోజిషన్.. ఏంటి యాంగిల్ మెంట్ వంటి సూత్రాలను ఉపయోగించి ఇవి లెక్కించబడతాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట కంప్యూటర్ సమస్యలను పరిష్కరిస్తుంది.

క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణం కోసం ఇప్పటికే ఇన్‌స్టాలేషన్ పనులు మొదలయ్యాయి. ఈ సెంటర్‌లో 150 క్యూబిట్స్ కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. దీనికోసం అమెరికా నుంచి 120 క్యూబ్ బిట్స్ క్వాంటం కంప్యూటర్ ను ఏకంగా అమరావతికి తీసుకొచ్చారు. ఇక ఇప్పటికైతే 120 క్యూ బిట్స్ కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్ చేసినప్పటికీ.. భవిష్యత్తులో దీన్ని సామర్ధ్యాన్ని 1000 క్యూ బిట్‌లు విస్తరించే విధంగా ముందస్తుగా ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో సున్నితమైన వాతావరణంలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేస్తుంది. అందుకే అధికారులు దీనికోసం ప్రత్యేకమైన ఛాంబర్ నిర్మించారు. ఇది ఫైర్ ప్రూఫ్.. బ్రేక్ ప్రూఫ్ ఉండే విధంగా పటిష్టమైన అద్దాలతో నిర్మించారు. ఆ అద్దాలలోనే కర్టెన్లు ఉంటాయి. ఇక ఈ ఛాంబర్ లో నిరంతరం 270 స్థాయి ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను ఐబీఎం సంస్థ పర్యవేక్షిస్తుంది. ఛాంబర్ ను చల్లగా ఉంచడానికి అవసరమైన నైట్రోజన్.. హీలియం సిలిండర్లను తెప్పించారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird