Home ఆంధ్రప్రదేశ్ Tirumala jewelry : శ్రీవారికి తల నుంచి పాదాల వరకు 46 రకాల – Andhra Waves

Tirumala jewelry : శ్రీవారికి తల నుంచి పాదాల వరకు 46 రకాల – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Tirumala jewelry donation : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి భక్తులు సమర్పించే కానుకలు ఎన్నో ఉంటాయి. కొందరు నగదు సమర్పిస్తే.. మరికొందరు బంగారం, వెండి ఆభరణాలను కానుకగా ఇస్తుంటారు. అయితే ఈసారి ఓ భక్తుడు సమర్పించిన కానుకలు మాత్రం ప్రత్యేకంగా నిలిచాయి. ఇవి కేవలం బంగారు ఆభరణాలు మాత్రమే కాదు.. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని పాదాల వరకు అలంకరించేలా తల రూపొందించిన అపురూపమైన నగలు. మొత్తం 121 కిలోల బంగారంతో తయారైన ఈ ఆభరణాలు తిరుమలలో ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

121 కిలోల బంగారం.. భక్తిలో అపురూపమైన కానుక!
చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, దాత వర్థమాన్ జైన్, ఆయన సతీమణి రాధికా జైన్ దంపతులు తిరుమల శ్రీవారికి భారీ స్వర్ణాభరణాలను సమర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా భువనేశ్వరి సమక్షంలో ఈ ఆభరణాలను టీటీడీకి అందించారు. మొత్తం 121 కిలోల బంగారంతో రూపొందించిన ఈ కానుకల్లో 106 కిలోల బరువున్న 46 రకాల ఆభరణాలు శ్రీవారికి సమర్పించగా.. మరో 15 కిలోల బంగారంతో తయారు చేసిన చీరను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి అందించారు.

ఈ కానుకల్లో విశేషమేమిటంటే.. స్వామివారి అలంకరణకు అవసరమైన దాదాపు అన్ని రకాల ఆభరణాలను ఒకే సమర్పణలో అందించడం. పాదాలకు ధరించే కవచాల నుంచి తలపై అలంకరించే కిరీటం వరకు ప్రత్యేకంగా రూపొందించడం విశేషం.

పాదాల నుంచి కిరీటం వరకు.. ఏయే ఆభరణాలు విరాళం అంటే..

ఈ 46 రకాల ఆభరణాల్లో సంప్రదాయ వైష్ణవ ఆభరణాల ప్రత్యేకత కనిపిస్తుంది.
– పాదాల అలంకరణ: బంగారు పాద కవచాలు, అందెలు, పాకడాలు.
– నడుము అలంకరణ: సాదా వడ్డాణం, గంటల మొలతాడు, నాగాభరణ వడ్డాణం, సూర్యకటారి.
– హారాలు, కంఠాభరణాలు: అష్టోత్తర కాసుల మాల, తులసిపాత్ర హారం, చతుర్భుజ లక్ష్మీ హారం, అశ్వత్థ పాత్ర హారం, ఐదు పేటల కంఠీలు, చంద్రవంకీ కంఠీ, సాలిగ్రామ హారాలు.
– ఛాతీ అలంకరణ: కౌస్తుభం, శ్రీవత్సం, పులిగోరు, వైకుంఠ హస్తం.
– చేతులు, భుజాల అలంకరణ: నాగాభరణ కడియాలు, మోచేయి ఆభరణం, కటి హస్తం, భుజకీర్తులు.
– ముఖం, తల అలంకరణ: కర్ణపత్రాలు, భావళీలు, కిటీపు ముఖపట్టి, బంగారు కిరీటం.
– ఇతర దివ్యాభరణాలు: యజ్ఞోపవీతం, శంఖ కవచం, చక్ర కవచం, గోపు ఇతర ఆభరణాలు.
వజ్రాలు, రత్నాలతో మరింత ప్రత్యేకం!
ఈ ఆభరణాల్లో బంగారం కాకుండా విలువైన రత్నాలను కూడా పొడిగారు. ముఖ్యంగా 2,427 క్యారెట్ల బరువున్న నీలాలు, పుష్యరాగాలు, కెంపులు, పచ్చలతో రూపొందించిన శ్రీవత్సం పతకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే 238.2 క్యారెట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు కూడా ఈ కానుకల్లో ఉన్నాయి. ఇవి స్వామివారి అలంకరణకు మరింత శోభను తీసుకొచ్చేలా రూపొందించినట్లు చూపుతోంది.

అమ్మవారికి 15 కిలోల బంగారు చీర!
శ్రీవారికి మాత్రమే కాకుండా తిరుచానూరులో కొలువైన పద్మావతి అమ్మవారికి కూడా జైన్ దంపతులు ప్రత్యేక కానుక సమర్పించారు. 15 కిలోల బంగారంతో రూపొందించిన బంగారు చీరను అమ్మవారికి అందించారు. దీంతో మొత్తం 121 కిలోల బంగారంతో రెండు ఆలయాల దైవాలకు స్వర్ణ కానుకలు సమర్పించినట్లయింది.

ఆభరణాల వెనుక ఉన్నది భక్తి.. తరతరాలకు నిలిచే కానుక!
సాధారణంగా భక్తులు స్వామివారికి నాగలు సమర్పించడం కొత్తేమీ కాదు. కానీ ఒకేసారి 46 రకాల ఆభరణాలను సమర్పించడం, వాటిలో పాదాల నుంచి కిరీటం వరకు ప్రతి అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కానుకను ప్రత్యేకంగా నిలబెట్టింది.

బంగారం విలువను కేవలం కిలోల్లోనో, క్యారెట్లలోనో కొలవొచ్చు. కానీ భక్తి విలువను మాత్రం అలా లెక్కించలేం. వర్థమాన్ జైన్ దంపతులు సమర్పించిన ఈ స్వర్ణాభరణాలు తిరుమల ఆలయ ఆభరణాల సంపదలో మరో ప్రత్యేక అధ్యాయంలో నిలిచిపోనున్నాయి. భక్తి, సంప్రదాయం, శిల్పకళ కలగలిసిన ఈ కానుకలు శ్రీవారి అలంకరణలో ఎలాంటి ప్రత్యేకతను తీసుకొస్తాయో చూడాలి.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird