Home ఆంధ్రప్రదేశ్ Tirumala Donations: వెంకటేశ్వర స్వామికి 121 కిలోల బంగారం – Andhra Waves

Tirumala Donations: వెంకటేశ్వర స్వామికి 121 కిలోల బంగారం – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Tirumala Donations: తిరుమల శ్రీవారికి భక్తుల సమర్పించే కానుకలు. కొందరు బంగారు ఆభరణాలు అందిస్తే.. మరికొందరు ఆలయాల అభివృద్ధికి.. అన్నదానానికి.. ధార్మిక కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాంటి భక్తులలో ఈయనకు అగ్ర పీఠం వేయవచ్చు. స్వామివారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను ఈయన ఇచ్చారు. తిరుమల చరిత్రలోనే అతిపెద్ద దాతృత్వ కార్యక్రమం. బంగారు ఆభరణాలను గురువారం అందజేసిన ఈ దాత.. తన వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా […]

తిరుమల విరాళాలు: తిరుమల శ్రీవారికి భక్తుల సమర్పించే కానుకలు ఎన్నో. కొందరు బంగారు ఆభరణాలు అందిస్తే.. మరికొందరు ఆలయాల అభివృద్ధికి.. అన్నదానానికి.. ధార్మిక కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాంటి భక్తులలో ఈయనకు అగ్ర పీఠం వేయవచ్చు. స్వామివారికి ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను ఈయన ఇచ్చారు. తిరుమల చరిత్రలోనే అతిపెద్ద దాతృత్వ కార్యక్రమం. బంగారు ఆభరణాలను గురువారం అందజేసిన ఈ దాత.. తన వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు. చివరికి ఆయన వివరాలు బయటకు వచ్చాయి.

తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు అందించిన ఆ దాత పేరు వర్ధమాన్ జైన్. ఈయన చెన్నైకి చెందినవారు. యాక్సెస్ హెల్త్ కేర్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. వైస్ చైర్మన్ గా ఉన్న ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి అనేక సందర్భాల్లో కోట్లాది రూపాయలను విరాళాలుగా అందించారు. 2025 జనవరిలో ఆయన సమర్పించిన ఆరు విరాళం వార్తల్లో కోట్ల. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడంతో పాటు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వర్ధమాన్ జైన్ నేపథ్యం ఎంతోమందికి ఆదర్శం.

వర్ధమాన్ ఒక పారిశ్రామికవేత్త. టెక్నాలజీ రంగంలో ఎంతో అనుభవం ఈయన సొంతం. ఈయన యాక్సెస్ హెల్త్ కేర్ అనే సంస్థకు సహా వ్యవస్థాపకుడు. వైస్ చైర్మన్ కూడా. వజ్రంగానికి అవసరమైన బిజినెస్ ప్రాసెస్ సేవలు.. హెల్త్ కేర్ రెవిన్యూ సైకిల్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఈ సంస్థ పనిచేస్తోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్.. ఆస్టిన్ నుంచి కంప్యూటర్ సైన్స్ లో.. చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి స్టాటిస్టిక్స్ లో ఈయన ఉన్నత విద్యను అభ్యసించారు. గతంలో డెల్ సర్వీసెస్ బిపిఓ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. అంతకుముందు విజన్ హెల్త్ సోర్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా కొనసాగారు.

2011లో ప్రారంభమైన యాక్సిస్ హెల్త్ కేర్ సంస్థ వైద్య సేవల నిర్వహణకు అవసరమైన సాంకేతికత.. వ్యాపార సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఆసుపత్రులు.. వైద్య సంస్థలకు సైకిల్ మేనేజ్‌మెంట్ సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన కార్యకలాపాల్లో ఒకటి. వైద్య బిల్లుల నిర్వహణ.. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్.. పేషెంట్ రికార్డుల నిర్వహణ.. ఆర్థిక లావాదేవీల ప్రాసెసింగ్ వంటి సేవలలో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. లెర్నింగ్.. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వంటి సాంకేతికతలను ఉపయోగిస్తుంది.. వర్ధమాన్ జైన్‌కు తిరుమల శ్రీవారిపై ప్రత్యేకమైన భక్తి ఉంది. ఆయన అనేక సందర్భాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు.

  • జూలై 2020లో ఎస్వీబీసీ ట్రస్ట్‌కు వర్ధమాన్ 2.1 కోట్లను విరాళంగా అందించారు.
  • ఫిబ్రవరి 2024లో అన్న ప్రసాదం.. ధర్మ ప్రచార కార్యక్రమాల కోసం 43.44 లక్షలకు వర్ధమాన్ విరాళంగా ఇచ్చారు.
  • ఏప్రిల్ 2024లో చెన్నై టీ నగర్‌లోని శ్రీవారి ఆలయ విస్తరణ పనుల కోసం 1.02 కోట్లను వర్ధమాన్ విరాళంగా ఇచ్చారు.
  • నవంబర్ 2024లో ఎస్వీ ప్రసాదం ట్రస్ట్.. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టులకు చెరో 1.1 కోట్లను వర్ధమాన్ విరాళంగా ఇచ్చారు.
  • జనవరి 2025లో 6 కోట్లను విరాళంగా ఇచ్చారు. ఇందులో ఎస్ వి బి సి కి ఐదు కోట్లు.. గో సంరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు వర్ధమాన్ ఇచ్చారు..

వర్ధమాన్ జైన్ వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాలేదు. సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చురుగ్గా కొనసాగించారు. శ్రీ సరితా జైన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా విద్యకు ఆర్థిక సహాయం.. ఆకలితో ఉన్నవారికి ఆహారం.. అత్యవసర వైద్య అవసరాలకు సహకారం అందిస్తున్నారు. పేద.. వెనుకబడిన యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దీనికోసం ఆవిష్కార్ అని కూడా ఆయన మొదలుపెట్టారు. చెన్నై ఏంజెల్స్ ద్వారా అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయానికి విరాళాలు అందించే దాతల్లో వర్ధమాన్ జైన్ ముందు వరుసలో ఉన్నారు. ఎస్ వి బి సి.. అన్న ప్రసాదం.. సంరక్షణ.. ఆలయ అభివృద్ధి వంటి వివిధ కార్యక్రమాలకు ఆయన విరాళాలు అందించారు. 2025 జనవరిలో సమర్పించిన ఆరు కోట్ల విరాళం ఆయన గతంలో అందించిన విరాళాలకి కొనసాగింపుగా నిలిచింది. వ్యాపార రంగంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఆయన సహాయం చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird