రాప్తాడు అమ్మాయి: ఖలేజా సినిమా చూశారా.. అందులో ప్రకాష్ రాజ్ గ్యాంగ్ చేతిలో పాలి గ్రామంలో ఉన్న వారంతా చనిపోతుంటారు. అందులో ఒక పసబిడ్డ ప్రాణాన్ని మహేష్ కాపాడుతారు. ఆ సమయంలో ఆ ఊరి వాళ్ళు.. స్వామి ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం.. ఇది నువ్వు కాపాడిన ప్రాణం.. కత్తికి అందకుండా కాపాడిన ప్రాణం. నువ్వు మా దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది మమ్మల్ని నమ్మించాల్సిన పనిలేదు.. ఈ సీన్ చూస్తుంటే రోమాలు […]
రాప్తాడు అమ్మాయి: ఖలేజా సినిమా చూశారా.. అందులో ప్రకాష్ రాజ్ గ్యాంగ్ చేతిలో పాలి గ్రామంలో ఉన్న వారంతా చనిపోతుంటారు. అందులో ఒక పసబిడ్డ ప్రాణాన్ని మహేష్ కాపాడుతారు. ఆ సమయంలో ఆ ఊరి వాళ్ళు.. స్వామి ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం.. ఇది నువ్వు కాపాడిన ప్రాణం.. కత్తికి అందకుండా కాపాడిన ప్రాణం. నువ్వు మా దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. అది మమ్మల్ని నమ్మించాల్సిన పనిలేదు.. ఈ సీన్ చూస్తుంటే రోమాలు నొక్క పొడుస్తుంటాయి కదా.. అదంటే సినిమా.. లిబర్టీ ఉంటుంది. కానీ ఇది రియల్ లైఫ్ లో జరిగితే..
అనంతపురం జిల్లా రాప్తాడులో ఇటీవల ఒక కామాంధుడు పదవ తరగతి చదివే బాలికపై దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడింది. ఈ నేపథ్యంలో ఆ బాలికను తన కూతురిగా అభివర్ణించారు నారా లోకేష్. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. అక్కడ ప్రత్యేక వైద్య చికిత్సలు జరిగాయి. చివరికి ఆ బాలిక కోలుకుంది. ఆ బాలిక పరిస్థితిని పర్యవేక్షించేందుకు నారా లోకేష్ నేరుగా బెంగళూరు వెళ్లారు. బాలికను పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొడుకుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
మృత్యుతో పోరాడి గెలిచిన బాలిక ఆరోగ్యం కుదుటపడింది. ఆ బాలికలో మానసిక ఉల్లాసం.. ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఎమర్జెన్సీ మెడిసిన్ బృందం ప్రత్యేకంగా వేడుక కూడా నిర్వహించబడింది. ఆమె చికిత్స గదిని బెలూన్లతో అందంగా అలంకరించింది. వైద్యులు.. నర్సింగ్ సిబ్బందికి మధురమైన సంగీతాన్ని వినిపించడం ప్రారంభించారు.
ఇన్ని రోజులపాటు తీవ్రమైన నొప్పితో ఆ బాలిక బాధపడింది. చివరికి వైద్యులు అందించిన ప్రోత్సాహంతో తన కాళ్ళ మీద తన నిలబడింది. నవ్వుతూ కేక్ కట్ చేసింది. ఆ తర్వాత ఆ బాలిక మాట్లాడింది. నా ప్రాణాలు కాపాడినందుకు కష్టపడిన వారందరికీ ధన్యవాదాలు అంటూ కామెంట్లు చేసింది. ఆ బాలికను ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఆమె ప్రాణాన్ని కాపాడుతానని నారా లోకేష్ చెప్పారు. ఆమె తన కూతురు లాంటిదని. చివరికి మాట ఇచ్చినను నిలబెట్టుకున్నారు. ఆ బాలిక ప్రాణాలను నిలబెట్టి.. ఆమె దృష్టిలో ఒక హీరోగా నిలిచారు. సాధారణంగా ప్రభుత్వ మంత్రులు పరామర్శకు పరిమితమవుతారు. కానీ నారా లోకేష్ పరామర్శకు కాకుండా.. ఆత్మీయ స్పర్శను చూపించారు. ఆ బాలిక ప్రాణాలను కాపాడగలిగారు. ఆ బాలిక ఆరోగ్య స్థితిని నారా లోకేష్ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా బాలిక ఆరోగ్య పరిస్థితిని బయట పెట్టారు.
నవీకరణ (5 PM, 24 నవంబర్ 2026)
చిన్న హావభావాలు అతిపెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లల గదిలో మనోహరమైన కేక్ కటింగ్ మరియు మ్యూజికల్ సెషన్‌ను ఏర్పాటు చేసినందుకు PEM బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమె బలం మరియు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను! https://t.co/k8fsu7fbmG
— లోకేష్ నారా (@naralokesh) నవంబర్ 24, 2026
