
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం, అభివృద్ధి పనుల వేగంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసలు గుప్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం విషయంలో చూపుతున్న చొరవ అనితర సాధ్యమని ప్రపంచ బ్యాంకు ప్రతినిథులు కొనియాడారు. అమరావతి పనుల్లో ఇదే వేగం కొనసాగితే.. నిర్దేశించుకున్న గడువు కంటే ముందే రాష్ట్ర రాజధాని ప్రాజెక్టు పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధుల బృందం ప్రాంతంలో బుధవారం (నవంబర్ 25) అమరావతి నిర్మాణ పనులను పరిశీలించారు.
సీఆర్ఏ అధికారులతో కలిసి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల ప్రతినిధులతో కలిసి సహకరించింది. అలాగే.. అమరావతిలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. మారుతున్న ప్రణాళికలకు అనుగుణంగా చేపడుతున్న నిర్మాణ పనుల స్థితిగతులను ప్రతినిధి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల అమలులో భాగంగా పాటిస్తున్న సామాజిక భద్రతా ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, లేబర్ క్యాంపులలో కార్మికులకు కల్పిస్తున్న భద్రత, వస్తువులపై ప్రతినిధులు ఆరా తీశారు.
అలాగే కమ్యూనికేషన్ ప్రణాళిక, సమస్యల పరిష్కార వేదిక పనితీరు, రాజధాని రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను బ్యాంకు బృందం సమీక్షించింది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన వివిధ పథకాల అమలు తీరును పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేసింది. అలాగే.. వైకుంఠపురం స్టేషన్, రివర్‌ఫ్రాంట్‌గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలు, కృష్ణా కరకట్ట రహదారి, మందడం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఆసియా ఆసియా బ్యాంకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ రెండు బ్యాంకల ప్రతినిధులు అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు, నిధుల వినియోగం, పనుల నాణ్యత, ప్రగతిని సమీక్షిస్తున్నారు. ఈ కోసమే తాజా పర్యటన జరిగింది.

ఆర్థిక సహాయ వివరాలు, అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు చెరో 15 వేల కోట్ల చొప్పున మొత్తం 30 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందించాయి. ఈ రుణంలో ఇప్పటికే దాదాపు 22 వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్రానికి అందాయి. పనుల వేగం పెరగడంతో పాటు మరో రూ. 15 వేల కోట్ల రుణం సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించగా, ప్రస్తుతం ఆ ప్రతిపాదనపై బ్యాంకుల పరిశీలన కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: అమరావతికి చట్టబద్ధతపై గెజిట్.. చంద్రబాబు హర్షం
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో పనులను పర్యవేక్షిస్తుండటం వల్ల ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రశంసలు గుప్పించారు. బ్యాంకుల బృందం ఇచ్చిన సూచనలను అమలు చేస్తూ, పర్యావరణ, సామాజిక నిబంధనలను పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేయాలని సీఆర్డీఏ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ఇక అదనంగా రాష్ట్రం కోరిన 15 వేల కోట్ల రూపాయల రుణంపై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి సానుకూల నిర్ణయం వెలువడితే అమరావతిలో మౌలిక సదుపాయాలు, ప్రముఖులు, రివర్ ఫ్రంట్ వంటి కీలక ప్రాజెక్టులు మరింత వేగవంతం కావడంలో సందేహం లేదు. అంతర్జాతీయ బ్యాంకుల ప్రశంసల నేపథ్యంలో రాజధాని నిర్మాణ పనులు నిర్ణీత సమయానికంటే ముందే ఒక రూపానికి వస్తాయన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మీకు నచ్చవచ్చు: అమరావతి పనులు భేష్: పారదర్శకత శభాష్.. అదనపు ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ బ్యాంకులు సై.!
హైదరాబాద్ గతం.. అమరావతి భవిష్యత్.. చంద్రబాబునాయుడు
[World Bank, ADB, Praises, AP CM Chandrababu, initiatives, Speed, Amaravati, Development projects,TeluguOne]
