Home ఆంధ్రప్రదేశ్ Cm Chandrababu Naidu: చంద్రబాబు ,లోకేష్ లలో ఉన్న గొప్పతనం అదే..ఇలా ఏ నాయకులు చెయ్యలేరు! – Andhra Waves

Cm Chandrababu Naidu: చంద్రబాబు ,లోకేష్ లలో ఉన్న గొప్పతనం అదే..ఇలా ఏ నాయకులు చెయ్యలేరు! – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper



సీఎం చంద్రబాబు నాయుడు: రాజకీయ పార్టీ అంటే కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదు , వందల మంది నాయకులకు సంబంధించినది , లక్షలాది మంది కార్యకర్తలకు సంబంధించినది. వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇచ్చిన రోజే పార్టీ గెలుస్తుంది , జనాల్లోకి బలంగా దూసుకెళ్తుంది, అధికారం లోకి వస్తుంది. వైసీపీ పార్టీ లో నాయకత్వం ఎలా ఉంటుందో మనందరికీ తెలుస్తుంది. ఆ పార్టీలోని నాయకుల సలహాలకు జగన్ ఎలాంటి విలువ ఇవ్వడు. తనకు ఏది తోచితే అది చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కానీ చంద్రబాబు , లోకేష్ అలా కాదు , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకుల మాట విని , కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, దానికి తగ్గట్టుగా అభ్యర్థులను ప్రకటించి బీ ఫార్మ్స్ అందించారు. లిస్టు ని పరిశీలించి చూస్తే గెలుపు గుర్రాలని బరిలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.

అంతే కాదు మిత్రపక్షాలకు కూడా సరైన గౌరవం ఇస్తూ తెలుగు దేశం పార్టీ ముందుకెళ్తోంది. కూటమి లో ఉన్నటువంటి జనసేన , బీజేపీ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ , ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ఉందంటే అందుకు కారణం చంద్రబాబు మాత్రమే. జనసేన పోటీ చేసే అనేక స్థానాల్లో టీడీపీ పార్టీ సభ్యులు , అదే విధంగా టీడీపీ పార్టీ పోటీ చేసే అనేక స్థానాల్లో జనసేన సభ్యులు నామినేషన్ వేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. మిత్ర ధర్మం పాటించకుండా, జనసేన అభ్యర్థులకు పోటీగా రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నామినేషన్ వేసినవాళ్లంతా నేడు ఉపసంకరించారు. టీడీపీ నేతలు సహకరించడంతో జనసేన రెబల్స్ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు.

అంతే కాకుండా ప్రతిపక్షం పట్ల కూడా టీడీపీ ప్రజాస్వామ్య పద్ద ఎదురుకొంటోంది. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగియో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీడీపీ , జనసేన పార్టీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వెయ్యనివ్వలేదు. ఒకవేళ నామినేషన్ వేస్తే ఆ పార్టీల అభ్యర్థులపై దాడులు చేయడం , కిడ్నాపులు చేయడం కూడా చేశారు. అయినా కూడా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం లేదు. తమతో పాటు సమానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ కి కూడా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించింది. చంద్రబాబు , లోకేష్ నిబద్దత , రాజ్యాంగం పట్ల గౌరవం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేమి ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird