మిస్ యూనివర్స్ 2026: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురుచూసిన మీ శ్రీనివాస్ 2026 పోటీల్లో భారత్ కు నిరాశ ఎదురైంది. భారతదేశం తరపున పోటీపడిన కేరళకి చెందిన 19 అందాల భామ కాజియా లిజ్ మోజో (Kaziah Liz Mejo) టాప్ 12 లో చూడు దక్కించుకోలేకపోయింది. టాప్ 30 వరకు చేరుకున్నప్పటికీ.. తదుపరి రౌండ్‌లో అర్హత సాధించలేకపోయింది. దీంతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోవాలంటే భారతీయుల ఆశలు ఈసారి నెరవేరలేదు. ఎవరీ కాజియా […]
మిస్ యూనివర్స్ 2026: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురుచూసిన మీ శ్రీనివాస్ 2026 పోటీల్లో భారత్ కు నిరాశ ఎదురైంది. భారతదేశం తరపున పోటీపడిన కేరళకి చెందిన 19 అందాల భామ కాజియా లిజ్ మోజో (Kaziah Liz Mejo) టాప్ 12 లో చూడు దక్కించుకోలేకపోయింది. టాప్ 30 వరకు చేరుకున్నప్పటికీ.. తదుపరి రౌండ్‌లో అర్హత సాధించలేకపోయింది. దీంతో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకోవాలంటే భారతీయుల ఆశలు ఈసారి నెరవేరలేదు.
ఎవరీ కాజియా లిజ్ మోజో?
కేరళ రాష్ట్రంలోని అలప్పుజ జిల్లాకు చెందిన మా వేలిక్కర లో కాజియా లిజ్ మోజో జన్మించింది. 19 సంవత్సరాల వయసులోనే అందాల పోటీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్న తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. ఆగస్టు 23న జైపూర్‌లో జరిగిన మిస్నివర్స్ ఇండియా పోటీల్లో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి విజేతగా నిలిచారు. అంతకుముందు మిస్ యూనివర్స్ కేరళ టైటిల్ ను గెలుచుకుంది. ప్రస్తుతం బెంగళూరులో న్యాయ శాస్త్రాన్ని చదువుతోంది. మోడలింగ్ రంగంలో ఉంది.
సంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాజియా
మిస్ యూనివర్స్ వేదికపై కాజియా తన అందంతోపాటు భారతీయ సంస్కృతిని కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. ముకుంద కేరళ సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే. పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ లో కేరళ సంప్రదాయ కనపు చీర స్ఫూర్తితో రూపొందించిన గౌడు ధరించింది. అలాగే నేషనల్ కాట్యూమ్ గ్రౌండ్ లో భారత దేశంలోనే వివిధ ప్రాంతాలకు చెందిన వస్త్ర సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక దుస్తులను ప్రదర్శించింది. ఆమె ధరించిన కాస్ట్యూమ్ లో కేరళ బ్యాక్ వాటర్స్.. హౌస్ బోట్లు.. కొబ్బరి చెట్లు.. సంప్రదాయ నిర్మాణ శైలులను ప్రతిబింబించే అంశాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ దుస్తుల రూపకల్పనలో హౌస్ ఆఫ్ సిద్ధాంత పాత్ర పోషించింది.
కాజియా కేవలం అందాల పోటీలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆమెకు చిన్నప్పటినుంచి కళల పై ఆసక్తి ఉంది. సుమారు 12 సంవత్సరాలు పాటు శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. సంగీతంలో ఈమెకు ప్రవేశం ఉంది. పాటలు పాడుతుంది. వయోలిన్ వాయిస్తుంది. మలయాళం లో రూపొందించిన శైలాక్ చిత్రం ద్వారా ఈమె నటిగా కూడా నటించింది.
మిస్ యూనివర్స్ చరిత్రలో భారతి ఇప్పటివరకు మూడు సార్లు విజేతగా నిలిచారు. 1994లో సుస్మిత సేన్.. 2000 సంవత్సరంలో లారా దత్త.. 2021లో హర్నాజ్ సందు విజేతగా నిలిచారు. ఈ ముగ్గురు తర్వాత భారత్ మరోసారి కిరీటం తగ్గించుకుంటోందని అభిమానులు ఆశించారు. అయితే మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో కాజియా టాప్ 12 కు చేరుకోలే భారత్ ఆశలు నెరవేరలేదు.
