Home అంతర్జాతీయం Polar Bear Protection : నిద్ర లేపినందుకు రూ.5 లక్షల జరిమానా! -Andhra Waves

Polar Bear Protection : నిద్ర లేపినందుకు రూ.5 లక్షల జరిమానా! -Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Polar Bear Protection : ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కావాలంటే లేపితే సహజంగానే కోపం వస్తుంది. అయితే నార్వేలో మాత్రం ఓ వ్యక్తి చేసిన ఈ పని ఏకంగా రూ.5 లక్షల జరిమానాకు దారితీసింది. అది కూడా ఓ మనిషిని నిద్రలేపినందుకు కాదు.. అరుదైన ధృవపు ఎలుగుబంటిని నిద్రలేపినందుకు! నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్‌ ద్వీపసమూహం అరుదైన ధృవపు ఎలుగుబంట్లకు కీలక ఆవాసంగా ఉంది. ఇక్కడి వన్యప్రాణులను రక్షించేందుకు నార్వే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది […]

Polar Bear Protection : ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు కావాలంటే లేపితే సహజంగానే కోపం వస్తుంది. అయితే నార్వేలో మాత్రం ఓ వ్యక్తి చేసిన ఈ పని ఏకంగా రూ.5 లక్షల జరిమానాకు దారితీసింది. అది కూడా ఓ మనిషిని నిద్రలేపినందుకు కాదు.. అరుదైన ధృవపు ఎలుగుబంటిని నిద్రలేపినందుకు!

నార్వేకు చెందిన స్వాల్‌బార్డ్‌ ద్వీపసమూహం అరుదైన ధృవపు ఎలుగుబంట్లకు కీలక ఆవాసంగా ఉంది. ఇక్కడి వన్యప్రాణులను రక్షించేందుకు నార్వే ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ధృవపు ఎలుగుబంట్లను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పర్యాటకులు, నౌకల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

ఇటీవల స్వాల్‌బార్డ్‌ పర్యాటకులతో వెళ్లిన ఓ నౌకలోని వ్యక్తి నిద్రిస్తున్న ఓ ధృవపు ఎలుగుబంటిని కావాలంటే నిద్రలేపేందుకు ఫాగ్‌హార్న్‌ మోగించాడు. భారీ శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఎలుగుబంటి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. వన్యప్రాణిని ఉద్దేశపూర్వకంగా భయపెట్టినందుకు ఆ వ్యక్తిపై సుమారు రూ.5 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.

ఫాగ్‌హార్న్ సాధారణ హారన్ లాంటిది కాదు. దట్టమైన పొగమంచులో నౌకలు పరస్పరం ఢీకొనకుండా హెచ్చరికలు ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీని శబ్దం చాలా దూరం వరకు వినిపించేంత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి భారీ శబ్దాలు అడవి జంతువులను తీవ్ర భయాందోళనలకు గురిచేయవచ్చు. భయంతో అవి చాలా దూరం పరుగెత్తాల్సి రావడం వల్ల అలసట, ఒత్తిడి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా తల్లి ధృవపు ఎలుగుబంటి భయంతో తన పిల్లల నుంచి దూరమైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. పిల్లలకు తల్లి పాలు అందకపోవడం వాటి ప్రాణాలకే ముప్పుగా మారొచ్చు. స్వాల్‌బార్డ్‌లో వన్యప్రాణుల విషయంలో అధికారులు కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.

పర్యాటకులు అరుదైన సహజ జంతువులను దగ్గరగా చూడాలంటే ఉత్సాహంలో జీవనానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫోటోలు, వీడియోల కోసం జంతువులను భయపెట్టడం లేదా వాటి ప్రవర్తనను మార్చేలా చేయడం వన్యప్రాణి సంరక్షణకు తీవ్ర నష్టం కలిగిస్తుందని స్పష్టం చేయబడింది.

ఒక్క హారన్ కొట్టినందుకే ఇంత భారీ జరిమానా ఎందుకని అనిపించినా.. అరుదైన ధృవపు ఎలుగుబంట్లను కాపాడేందుకు నార్వే తీసుకుంటున్న చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird