శర్వానంద్..సంపత్ నంది..కాంబినేషన్ లో రాధామోహన్ నిర్మించిన సినిమా భోగి. అనుపమ తో పాటు డింపుల్ హయాతీ కూడా ఈ సినిమాలో మరో హీరోయిన్. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వస్తోందీ సినిమా. ఈ సినిమా నలుగురికి చాలా చాలా కీలకం. అందరి కీలకకన్నా దర్శకుడు సంపత్ నంది కి. చాలా రోజులయింది పెద్ద మాస్ సినిమా ఆయన చేతి నుంచి వచ్చి. సీటీ మార్ తరువాత రకరకాలుగా గ్యాప్ వచ్చింది. ఈ సినిమా హిట్ కొడితే ఇక బండి స్పీడ్ అందుకుంటుంది. అందుకే ఆయన వరకు ఈ సినిమా సక్సెస్ చాలా క్రూషియల్.
శర్వానంద్ కు కూడా సరైన హిట్ పడి చాలా రోజులు అయింది. చేతిలో సినిమాలకు లోటు లేదు. కానీ హిట్ ట్రాక్ కంటిన్యూ కావాలి. అలా జరగాలి అంటే భోగి సినిమా మంచి హిట్ కావాల్సి వుంది.
ఆ తరువాత హీరోయిన్ డింపుల్ హయాతికి. ఆమెకు సరైన హిట్ పడడం లేదు. ఆదర్శకుటుంబంలో నటించింది కానీ పెద్దగా కలిసిరాలేదు. ఈ సినిమా హిట్ అయితే హమ్మయ్య అని అనుకోవచ్చు.
వీళ్లందరికన్నా కూడా నిర్మాత రాధామోహన్ ఈ సినిమా హిట్ అంటే చాలా అవసరం. ఇప్పటికే ఎన్నో సినిమాలు తీశారు ఆయన. కానీ ఆర్థికంగా పెద్దగా సంపాదించింది లేదు. ఆ మధ్య వచ్చిన భైరవం కారణంగా బాగా నష్టపోయారు. ఈ సినిమాకు కూడా గట్టిగా ఖర్చు చేసారు. అన్నీ రికవరీ కావాలంటే థియేటర్ లో సినిమా మంచి హిట్ అనిపించుకోవాల్సి వుంటుంది.
ఆ విధంగా నలుగురి కెరీర్ లు ముడిపడి వున్నాయి ఈ భోగి సినిమాతో.
The post భోగి.. ఆ నలుగురికీ కీలకం appeared first on iDreamPost.
