China hair regrowth electric comb: బట్టతల సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త. జుట్టు రాలిపోవడం.. తిరిగి పెరగకపోవడం అంటే సమస్యలకు పరిష్కారం కనుగొంది చైనా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణ దువ్వెన వంటి కనిపించే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ దువ్వెనను అభివృద్ధి చేశారు. దీనిని ఉపయోగించడం ద్వారా జుట్టు కుదుళ్ళకు విద్యుత్ ప్రేరణ అందించడంతోపాటు. ఈ పరికరానికి డిటాంగిల్ (Detangle) అనే పేరు పెట్టారు. ఎలుకల మీద నిర్వహించిన ప్రయోగాలలో మంచి ఫలితాలు వచ్చాయి..
ఎలా పనిచేస్తుందంటే
మనం ఉపయోగించే దువ్వెనకు.. ఈ ప్రత్యేకమైన దువ్వెనకు చాలా తేడా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ పళ్ళు.. ప్రత్యేకమైన ఎలక్ట్రోడ్లు.. మందులను నిల్వచేసే చిన్న మాడ్యూల్స్ ఉంటాయి. ఈ దువ్వెనతో జుట్టును దువ్వుతున్నప్పుడు తక్కువ స్థాయి విద్యుత్ క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. ఇది తల చర్మం మీద పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లలో లోతు ప్రాంతాలకు చేరుకుంటుంది. తలమీద పూర్ణ చర్మం మీద మందులను పూసినప్పుడు ఈ సాంకేతికత ద్వారా పాలికల్స్ తర్వాత 9 రెట్లు ఎక్కువ లోతు వరకు చేర్చే సామర్థ్యం కనిపించింది.
ఈ దువ్వెనలో ప్రధానంగా రెండు విధాలుగా ఈ సాంకేతికత పనిచేస్తుంది. ప్రత్యేక ఎలక్ట్రోడ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ క్షేత్రం జుట్టుకు కుదురులపై ప్రభావం చూపుతుంది. హెయిర్ ఫాలికల్స్ లో నియంత్రణ కార్యకలాపాలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ దువ్వెనలో ప్రత్యేక మందుల మాడ్యూల్స్ ఉంటాయి. వీటి ద్వారా VEGFA అనే ఉత్పత్తికి సంబంధించిన జన్యుపదార్థాన్ని.. అలాగే 5- ఆల్ఫా రేడక్టేజ్ (5 ఆల్ఫా రిడక్టేజ్) ను లక్ష్యంగా చేసుకునే si RNA ను హెయిర్ ఫాలికల్స్‌లోకి పంపిస్తారు.
VEGFA రక్తనాళాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల జుట్టుకు కుదురులకు రక్త సరఫరా మెరుగుపడే అవకాశం ఉంటుంది. మరోవైపు 5 ఆల్ఫా రేడక్టేజ్ -2 కార్యకలాపాలను తగ్గించడం ద్వారా జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్ల నియంత్రణను పరిశోధకులు చెబుతున్నారు.
ఈ పరిశుద్ధులలో భాగంగా శాస్త్రవేత్తలు ఏడుకుల మీద ప్రయోగాలు చేశారు. ఈ ప్రయోగాల్లో డిటాంగిల్ దువ్వెనను ఉపయోగించిన ఎలుకల్లో 28 రోజుల్లో 100% వరకు జుట్టు కవరేజ్ కనిపించింది. సాధారణంగా జుట్టు పెరుగుదలకు ఉపయోగించే మినాక్సిడిల్ (Minoxidil) తో పోల్చినప్పుడు ఈ దువ్వెన ఉపయోగించిన ఎలుకలలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. మినాక్సిడిల్ తో పోల్చినప్పుడు ఈ దువ్వెన ఉపయోగించిన ఎలుకల్లో జుట్టు కవరేజ్ సుమారు 70% ఉంది. ప్రయోగాత్మకంగా ఈ కొత్త సాంకేతికతను మెరుగుపరిచింది.
ప్రసాదం చాలామంది పురుషులు.. మహిళలు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. జన్యుపరమైన కారణాలు.. హార్మోన్ల ప్రభావం ఇతర అనారోగ్య సమస్యల వల్ల జుట్టు పలుచగా మారుతుంది. ఇప్పటివరకు అనేక రకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫినాప్తరాయిడ్.. మినాక్సిడైల్ వంటి మందులు ప్రత్యేకమైనవి. అయితే ఈ మందులను వైద్యుల సూచనల ప్రకారం ఉపయోగించాలి. కొత్తగా అభివృద్ధిచేసిన డిటాంగిల్ దువ్వెన మందులను నేరుగా జుట్టు కుదురులకు చేరవేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ పరికరం మనుషుల మీద ఏ స్థాయిలో పనిచేస్తుంది.. ఫలితాలు ఎలా ఉంటాయి.. దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి.. అనే విషయాల మీద పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.
చైనాలోని బీహాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధన వివరాలను ఇటీవల బయటపెట్టారు. జుట్టు రాల సమస్యకు బయో ఎలక్ట్రానిక్ సాంకేతికతను ఉపయోగించి ఒక ఆసక్తికరమైన పరిశోధన మీదకిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
బ్రేకింగ్: హైటెక్ దువ్వెన 30 రోజులలోపు బట్టతల చర్మంపై దాదాపు 100% కోల్పోయిన జుట్టును పునరుద్ధరించింది.
బీహాంగ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు “డిటాంగిల్” ను అభివృద్ధి చేశారు, ఇది సాధారణ వస్త్రధారణను లక్ష్య చికిత్సగా మారుస్తుంది. దైహిక దుష్ప్రభావాలు లేదా ఫోలికల్ మూలాలను చేరుకోలేని సమయోచిత ఔషధాలకు బదులుగా, డిటాంగిల్ యొక్క సూక్ష్మ-ఎలక్ట్రోడ్లు 9x లోతుగా విద్యుత్ క్షేత్రాన్ని నెత్తిమీదకు తీసుకువెళతాయి. ఇది కొత్త రక్తనాళాలను నిర్మించడానికి VEGF-Aలో జారిపోయేలా ఓపెన్ సెల్ గోడలను సున్నితంగా పల్స్ చేస్తుంది మరియు జుట్టు రాలడం మొదలయ్యే చోట ఫోలికల్-ఉక్కిరిబిక్కిరి DHT ఎంజైమ్‌లను నిశ్శబ్దం చేస్తుంది.
హార్డ్‌వేర్ మరియు బయోమెడికల్ ఇంజనీర్ల కోసం, ఈ స్థానికీకరించిన ఎలక్ట్రోపోరేషన్ విధానాన్ని మానవ క్లినికల్ ట్రయల్స్‌కు సురక్షితంగా స్కేలింగ్ చేయడానికి అతిపెద్ద సాంకేతిక అడ్డంకులు ఏమిటి?
— క్విల్ | AI & టెక్ (@CryptoQuill) నవంబర్ 11, 2026
