Home Latest News మహా సీఎం సుప్రియా సూలీ: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. శరద్ పవార్ వ్యూహాత్మక అడుగులు..? | సుప్రియా సూలే | శరద్ పవార్ | మహారాష్ట్ర రాజకీయాలు | NDA కూటమి | డీలిమిటేషన్ | పవార్ వ్యూహాలు – Andhra Waves

మహా సీఎం సుప్రియా సూలీ: ఎన్డీయేలోకి ఎన్సీపీ.. శరద్ పవార్ వ్యూహాత్మక అడుగులు..? | సుప్రియా సూలే | శరద్ పవార్ | మహారాష్ట్ర రాజకీయాలు | NDA కూటమి | డీలిమిటేషన్ | పవార్ వ్యూహాలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై త సుప్రియా సూలేను కూర్చోపెట్టే దిశగా ఎన్సీపీ(శరద్ పవార్) వ్యూహాలు రచిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇందుకు తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసం సిల్వర్ ఓల్ లో జరిగిన సమావేశాలు, సంప్రదింపులను ఉదాహరణగా చూపుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్ అయిన శరద్ పవార్.. మహా సీఎం పీఠంపై తన కుమార్తెను కూర్చోపెట్టే లక్ష్యంతో వ్యూహరచన ఉన్నట్లు చెబుతున్నారు. సిల్వర్ ఓక్ లో రహస్య మంతనాలు ఇందుకేనని విశ్లేషిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తన పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆయన సమాయత్తమౌతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలు నేతలలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తన ఆరోగ్యం, రాజకీయ వారసత్వం, పార్టీ భవిష్యత్తు వంటి అంశాలు శరద్ పవాన్ దృష్టిని కేంద్రీకరించినట్లు చెబుతున్నారు. ఇటీవల ప్రధానమంత్రి శరద్ పవార్ కు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, సుప్రియ సూలే సమయంలో రాజకీయ వ్యవహారాలు చూసుకుంటారని సూచించిన ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా అజిత్ పవార్ మరణాంతరం మారిన పరిస్థితులు, విలీన చర్చలపై వచ్చిన వాదనలు మహా రాజకీయాలలో మారుతున్న, మారనున్న రాజకీయ సమీకరణలకు అద్దం పడుతున్నాయి.

మహారాష్ట్రలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఇప్పటికే అధికార హోదా, పదవులలోని పంపకం వంటి అంశాలు ఒకింత గందరగోళంలో ఉన్నాయి. ఒకవేళ శరద్ పవార్ వర్గం ఎన్డీయే వైపు మొగ్గు చూపితే, మహారాష్ట్ర అధికార కూటమిలో సమీకరణలు సమూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. శరద్ పవార్ ఎన్సీపీ కనుక ఎన్డీయే కూటమిలో చేరితే.. అందుకు శరద్ పవార్ విధించే ఏకైక శరతు సుప్రియ సూలెకు సీఎం పదవి అని పరిశీలకులు అంటున్నారు. ఆ దిశగా బీజేపీతో ఇప్పటికే తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు, పరిపాలన, అభివృద్ధి పక్షాలు, అధికార పక్షాల మధ్య మాటల తూటాలు కొనసాగుతుండగానే, కొత్త రాజకీయ పొత్తులపై చర్చలు జోరుగా సాగుతుండడం ఇందుకు ఉదాహరణగా చూపబడింది. నియోజకవర్గాల పునర్విభజన భవిష్యత్తు ఎన్నికల వ్యూహం దృష్టిలో ఉంచుకుని శరద్ పవార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న రాజకీయవర్గాలలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: శరద్ పవార్..రాజకీయ చాణక్యుడు!

రాబోయే రోజుల్లో పార్లమెంటు సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన చర్చలు, అలాగే మహారాష్ట్ర కూటమిలోని పరిణామాల ఆధారంగా ఈ ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తంగా ఎన్డీయేలో చేరికపై శరద్ పవార్ నిర్ణయం, సుప్రియ సూలే రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉండేందుకు దోహదపడేలా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

మొత్తానికి మహా రాజకీయాలు శరద్ పవార్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన వ్యూహాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి అన్నదానిపైనే మహారాష్ట్ర పొలిటికల్ సినేరియాలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయన్న దానిపై క్లారిటీ వస్తుంది.

మీకు నచ్చవచ్చు: రాజ్యసభ బరిలో శరద్ పవార్

అసలు సినిమా ముందుంది.. ఏక్ నాథ్ షిండే.. శివసేన చీలిక వెనుక కేంద్రం.. ఉద్ధవ్

[Supriya Sule, Sharad Pawar, Maharashtra politics, NDA alliance, delimitation,PawarStrategies, TeluguOne]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird