MyTDP App : నాయకుల ప్రసంగాలతో పార్టీలు బలోపేతం కావు.. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల శ్రమ, వారి నిబద్ధత, వారి అభిప్రాయాలకు ఇచ్చే విలువతోనే బలమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణమవుతుంది. ఈ సూత్రాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ మరో కీలక మైలురాయిని చేరుకుంది. పార్టీకి, కార్యకర్తలకు మధ్య డిజిటల్ వారధిగా ప్రారంభించిన ‘మైటీడీపీ’ యాప్‌లో సభ్యుల సంఖ్య పది లక్షలకు చేరడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కార్యకర్తకు గుర్తింపు.. రాజకీయాల్లో ఇదే అసలైన మార్పు!
రాజకీయ పార్టీల విజయాల్లో నాయకుల పాత్ర ఎంత ముఖ్యమో.. కార్యకర్తల పాత్ర అంతకంటే కీలకం. ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరగడం, పార్టీల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, కష్టకాలంలోనూ పార్టీ జెండాను మోసం చేయడం.. ఇలా కార్యకర్తలు చేసే కృషి వెలకట్టలేనిది. అయితే చాలాసార్లు పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే అసంతృప్తి కనిపిస్తుంటుంది.
ఈ పరిస్థితిని మార్చాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘మైటీడీపీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పార్టీకి, కార్యకర్తలకు మధ్య కేవలం సమాచార సంబంధమే కాకుండా.. వారి అభిప్రాయాలు, సూచనలు, క్షేత్రస్థాయి అనుభవాలకు కూడా ప్రాధాన్యత కల్పించడమే ఈ డిజిటల్ వేదిక వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా ఆయన చూస్తున్నారు.
పది లక్షల సభ్యులు.. ఒక సంఖ్య కాదు, ఒక నమ్మకం!
మైటీడీపీ యాప్‌లో సభ్యుల సంఖ్య పది లక్షలకు చేరుకోవడం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సందర్భంగా నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ.. కార్యకర్తే నాయకుడని, కార్యకర్తే పార్టీకి బలమని పేర్కొన్నారు.
పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్కరి కృషిని గుర్తించాలని, ప్రతి కార్యకర్త అభిప్రాయానికి విలువ ఇవ్వాలని, కష్టపడే వారికి తగిన అవకాశాలు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌ను ప్రారంభించినట్లు. ఈ ప్రయాణంలో భాగమైన పది లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
డిజిటల్ వేదికగా కార్యకర్తల గొంతుక!
ప్రస్తుత సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ పాత్రలు పోషిస్తున్నాయి. గతంలో పార్టీ అధిష్ఠానానికి కార్యకర్తలు తమ సమస్యలు, అభిప్రాయాలు చేరవేయాలంటే అనేక మార్గాలు దాటాల్సి వస్తుంది. కానీ డిజిటల్ వేదికలు అందుబాటులోకి రావడంతో ఈ దూరాన్ని తగ్గించే అవకాశం ఏర్పడింది.
మైటీడీపీ వంటి వేదికల ద్వారా పార్టీ శ్రేణులను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం, వారి భాగస్వామ్యాన్ని పెంచడం, క్షేత్రస్థాయి కార్యకలాపాలకు గుర్తింపు కల్పించడం వంటి లక్ష్యాలను సాధించవచ్చు. అయితే ఈ వేదిక అసలు విజయవంతం కావాలంటే యాప్‌లో సభ్యుల సంఖ్య పెరగడమే కాకుండా.. కార్యకర్తల సమస్యలకు స్పందించడం, వారి సూచనలను తీసుకోవడం, అర్హులకు అవకాశాలు కల్పించడం కూడా అంతే ముఖ్యం.
నారా లోకేష్ ముందున్న అసలైన లక్ష్యం!
పది లక్షల మంది సభ్యులు చేరడం ఒక మైలురాయి మాత్రమే. ఆ పది లక్షల గొంతుకలకు పార్టీలో ఎంత ప్రాధాన్యత లభిస్తుందన్నదే అసలైన పరీక్ష. పార్టీ కోసం పనిచేసే సామాన్య కార్యకర్తకు నాయకత్వంతో నేరుగా అనుసంధానం కల్పించగలిగితే.. అది రాజకీయాల్లో ఒక కొత్త విధానానికి నాంది కావచ్చు.
నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు.. కింది స్థాయిలో పనిచేసే వారి శ్రమను గుర్తించడం కూడా. కార్యకర్తల అభిప్రాయాలను వినడం, వారి సామర్థ్యానికి తగిన బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావచ్చు.
మైటీడీపీ యాప్ పది లక్షల మంది సభ్యుల మైలురాయిని చేరడం టీడీపీకి డిజిటల్ పరంగా ఒక ముఖ్యమైన ముందడుగు. కానీ నారా లోకేష్ చెబుతున్నట్లుగా కార్యకర్తే నాయకుడనే భావనను క్షేత్రస్థాయిలోనూ నిజం చేయగలిగితే.. ఈ యాప్ కేవలం నమోదు వేదికగా కాకుండా, కార్యకర్తల సాధికారతకు ఒక వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీని నిర్మించేది నాయకత్వం అయితే.. ఆ పార్టీకి పునాది వేసేది కార్యకర్తే!
