Table of Contents
హైదరాబాద్ నగరం అనగానే కొన్ని తారల వారికి చార్మినార్ తో పాటు గుర్తుకు వచ్చే మరో కట్టడం నాంపల్లి రైల్వే స్టేషన్. నాంపల్లి స్టేషను కాడ అంటూ సినిమాల్లో వచ్చిన పాట అప్పట్లో చాలా ఫేమస్. నిజం సంస్కృతికి అద్దం పట్టేలా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్.. దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఎంతో చరిత్ర ఉన్న ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ ఇకపై కనిపించదు.
హైదరాబాద్ నగర వారసత్వానికి సజీవ సాక్ష్యం నిలిచిన మరో చారిత్రక కట్టడం తన పాత రూపాన్ని కోల్పోతోంది. ఇప్పటికే పునరాభివృద్ధి పనుల పేరుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నేలమట్టం చేసిన దక్షిణ మధ్య రైల్వే, తాజా చారిత్రక నాంపల్లి రైల్వే స్టేషన్‌లోనూ పాక్షిక కూల్చివేతలు చేపట్టారు. ఆధునికీకరణ, పునరాభివృద్ధి ప్రాజెక్టులలో భాగంగా ఈ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రైల్వే ఆధునిక స్టేషన్ల పేరుతో చారిత్రక కట్టడాలకు ముప్పు వాటిల్లుతుందని పౌరులు, వారసత్వ పరిరక్షణ కార్యకర్తలు గతంలోనే వ్యక్తం చేసిన ఆందోళనలు తాజా పరిణామాలతో నిజమయ్యాయి.
హెరిటేజ్ జాబితాలో లేకపోవడంతో
నాంపల్లి స్టేషన్‌లో జరుగుతున్న కూల్చివేతలపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ స్టేషన్ రక్షిత చారిత్రక కట్టడాల (హెరిటేజ్) జాబితాలో లేదు, అందువల్ల ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా అవసరమైన మార్పులు, కూల్చివేతలు చేపడుతున్నామని. అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ రక్షిత హెరిటేజ్ జాబితాలో ఉండటంతో అక్కడ ఎలాంటి పునరాభివృద్ధి, కూల్చివేత పనులు చేపట్టడం లేదని ఒక రైల్వే అధికారి పేర్కొన్నారు.
ఆరవ నిజాం కాలంలో నిర్మితం
‘హైదరాబాద్-దక్కన్’ స్టేషన్‌గా ప్రసిద్ధి చెందిన నాంపల్లి రైల్వే స్టేషన్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైనది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో 1907వ సంవత్సరంలో ఈ స్టేషన్ నిర్మితమైంది. ఆ రోజుల్లో హైదరాబాద్‌ను నాటి బొంబాయి (ముంబయి) నగరంతో అనుసంధానించే ప్రధాన కేంద్రంగా ఇది సేవలందించింది. రోగుల వసతి కోసం అప్పట్లో ‘నాంపల్లి సరాయి’ పేరుతో ఒక విశ్రాంతి భవనాన్ని కూడా నిర్మించారు. నిజాం కాలం నాటి నిర్మాణ శైలికి, హైదరాబాద్ చారిత్రక వైభవానికి ఈ కట్టడాలు ప్రతీకలుగా నిలిచాయి.
హైదరాబాద్ రైల్వే వ్యవస్థకు ఘన చరిత్ర
హైదరాబాద్ సంస్థానంలో రైల్వే నెట్‌వర్క్ దశలవారీగా విస్తరించింది. నగరంలో తొలిసారిగా నిర్మించిన వాడి-సికింద్రాబాద్ రైల్వే మార్గానికి 1869లో సర్వే నిర్వహించి, 1871లో పనులు జరిగాయి. 1874 అక్టోబర్ 9న ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. తొలినాళ్లలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే కంపెనీ దీనిని నిర్వహించేది.
చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ ప్రాంతంలో రైల్వేల అభివృద్ధి వెనుక ప్రజా రవాణాతో పాటు బ్రిటిష్ పాలకుల సైనికులు, ఆర్థిక అవసరాలు కూడా బలంగా పనిచేశాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో మోహరించిన బ్రిటిష్ సైనిక దళాలకు వేగవంతమైన రవాణా సదుపాయం కల్పించడం వారికి ప్రధాన అవసరం. ప్రజల ప్రయాణ సౌలభ్యం, ఆర్థికాభివృద్ధిని కాంక్షించిన నిజాం పాలకులు రైల్వేల విస్తరణకు చొరవ చూపారు.
ఇరుపక్షాల సంప్రదింపుల ఫలితంగా 1883లో ‘నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేస్’ ఆవిర్భవించింది. ఆ తర్వాతి కాలంలోనే నాంపల్లి, కాచిగూడ వంటి చారిత్రక రైల్వే స్టేషన్లు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నాంపల్లి స్టేషన్ రూపురేఖలు కూడా మారుత తర్వాత హైదరాబాద్ వారసత్వ కట్టడాల భవిష్యత్తుపై నగరవాసుల చర్చ జరుగుతోంది.
