Home సినిమా ఏఐ మాయలో పడితే.. ఖాతా ఖాళీ! – Andhra Waves

ఏఐ మాయలో పడితే.. ఖాతా ఖాళీ! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏఐ మాయలో పడితే.. ఖాతా ఖాళీ!


టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తోంది. అయితే ఇదే టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్ మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయి. గతంలో తప్పులు ఉన్న మెసేజ్‌లు, అనుమానాస్పద లింకుల ద్వారా మోసాలకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఏఐ సాయంతో అచ్చం నిజమైనవిగా కనిపించే వీడియోలు, గొంతులు, వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ముఖాలను ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారు. వీరు పెట్టుబడి పథకాలను ప్రోత్సహిస్తున్నట్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఫేక్ వెబ్‌సైట్లు లేదా వాట్సాప్ గ్రూపుల్లోకి తీసుకుంటున్నారు.

ఒకసారి బాధితులు ఆసక్తి చూపితే పెట్టుబడి సలహాదారులుగా పరిచయం చేసుకుని డబ్బులు పెట్టమని ఒత్తిడి చేస్తారు. కొన్నిసార్లు మొదట చిన్నగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తారు.ఏఐ వాయిస్ క్లోనింగ్ మరో ప్రమాదకరమైన పద్ధతి. తెలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా అధికారుల గొంతును అనుకరించి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి వచ్చిందని, వెంటనే డబ్బులు పంపాలని అడుగుతున్నారు.

గొంతు అచ్చం తెలిసిన వ్యక్తిలా ఉండటంతో చాలామంది నిజమేనని నమ్ముతున్నారు. అందుకే గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్‌లో ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పంపకూడదు. ఆ వ్యక్తికి ముందుగా తెలిసిన నంబర్‌కు తిరిగి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేకంగా ఒక రహస్య పదాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా డబ్బులు తిరిగి ఇప్పిస్తామని చెప్పి ముందుగా ఫీజు అడిగేవారిని నమ్మకూడదు. అది మరో మోసం అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ సైబర్ మోసానికి గురై డబ్బులు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకూడదు. వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి. సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి లావాదేవీని నిలిపివేయడానికి ప్రయత్నించాలి. ట్రాన్సాక్షన్ ఐడీలు, మెసేజ్‌లు, ఫోన్ నంబర్లు, స్క్రీన్‌షాట్లను ఆధారాలుగా భద్రపరచుకోవాలి.

మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird