Home ఆంధ్రప్రదేశ్ Jana Sena Party: జనసేనలో వైసీపీ కోవర్టులు..పవన్ – Andhra Waves

Jana Sena Party: జనసేనలో వైసీపీ కోవర్టులు..పవన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


Jana Sena Party: స్థానిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలంగా ఉంది. ఈ మూడు పార్టీల మధ్య 2024 నుంచి ఇప్పటివరకు సయోధ్య బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వైసీపీ విష ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బలంగా ఉన్నంతవరకు తాము ప్రజల్లో కూటమి నిలబడలేమని వైసిపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. అందువల్లే తాడేపల్లి కేంద్రంగా విష ప్రచారం. జనసేన ను పక్కకు […]

జనసేన పార్టీ: స్థానిక ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి బలంగా ఉంది. ఈ మూడు పార్టీల మధ్య 2024 నుంచి ఇప్పటివరకు సయోధ్య బ్రహ్మాండంగా ఉంది. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఏర్పడిన కూటమిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక వైసీపీ విష ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బలంగా ఉన్నంతవరకు తాము ప్రజల్లో కూటమి నిలబడలేమని వైసిపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. అందువల్లే తాడేపల్లి కేంద్రంగా విష ప్రచారం.

జనసేన ను పక్కకు తప్పించాలని..

జనసేన నుంచి పక్కకు కూటమిని తప్పించాలని కుట్రలకు శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకుల్లో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని విద్వేషాలను నాటుతున్నారు. ఈ వైసిపికి అనుకూలంగా పనిచేసే ముసుగు సోషల్ మీడియా వీరులు రెచ్చిపోతున్నారు. నిజానికి ప్రత్యక్షంగా చేయాల్సిన రాజకీయ యుద్ధాన్ని ముసుగు లాగా మార్చేశారు. తెర వెనుక ఉంటూ.. సామాజిక మాధ్యమాల ద్వారా అత్యంత నీచమైన ప్రచారాన్ని చేస్తున్నారు.

వారితో ఎత్తుగడలు

తమ విష ప్రచారానికి వైసీపీ నేతలు ముఖ్యంగా జనసేనలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులను.. గతంలో టిడిపి తో విభేదాలు ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. వారితో ఎత్తుగడలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తప్పు పట్టే విధంగా వారితో కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని మొత్తం తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని.. ఆయన ప్రయోజనాల కోసం టిడిపి వద్ద తలపంచుకుంటున్నారని.. ఫేక్ అకౌంట్లతో ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయిని.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. దీనివల్ల జనసేన నాయకుల్లో నైతికస్థైర్యం దెబ్బతింటుందని తాడేపల్లి నాయకులు అంచనా వేస్తున్నారు. చివరికి వైసీపీ నాయకుల ఫేక్ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్ళిందంటే.. వేగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో ఒక వాట్సాప్ ఛానల్ సృష్టించారు. జనసేన నుంచి బయటికి వచ్చిందంటూ కల్పిత ప్రకటన చేశారు. దానిని విపరీతంగా వైరల్ చేశారు. దీనితో డిప్యూటీ సీఎంఓ నేరుగా రంగంలోకి దిగింది. క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీనిని బట్టి సైబర్ విషం వైసీపీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోవర్టులు ఉన్నారా?

వాస్తవానికి ఏకంగా డిప్యూటీ సీఎం పేరుతో వాట్సప్ ఛానల్ ఏర్పాటు చేయడం వెనుక బయట మాత్రమే కాకుండా.. జనసేనలో ఉన్న ఇంటి దొంగలు కూడా కారణమని శత్రువులు. ఆ ఇంటి దొంగలు వైసిపికి చెందిన వారని.. వారంతా కూడా పార్టీ నుంచి పక్కకు వచ్చి జనసేన కండువా కప్పుకొని.. వైసిపి ఎజెండాను మోస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం. స్థానిక సంస్థలకు సంబంధించిన పదవులు దక్కకపోవడం.. ముడుపులు లభించిన కొందరు మాజీ వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఇలాంటి అసంతృప్తికి బీజం వేస్తున్నారు. నిజానికి బయటి దొంగల కంటే.. ఇంటి దొంగలతోనే ఎవరికైనా ప్రమాదం. అందుకే జనసేనలో ఉన్న అంతర్గత విషయాలకు వేరే రంగు పూసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోతే పార్టీ పోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకొని

2024లో గెలిచిన నాటి నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తోంది. కూటమిలో లేని అగాధాన్ని ఉందని ప్రచారం చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను బయటికి పంపించాలని కుట్రలకు శ్రీకారం చుడుతోంది. నిజానికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు నడుం బిగించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వలేదు. దీంతో వైసిపికి దారుణమైన ఓటమి తప్పలేదు. అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే తాము తేలికగా వస్తామని వైసిపి భ్రమపడుతోంది. అందువల్లే పవన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది. కేడర్ మధ్య చిచ్చు పెడుతోంది. ఈ చర్యల ద్వారా వారి బంధాన్ని తుంచి వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో జనసేనలో ఉన్న కోవర్టులను ఏరిపారేయాల్సిందే. తన్ని తరిమేయాల్సిందే. అలాంటి వారికి ఇంకా అవకాశాలు కల్పిస్తే జనసేన పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉంది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird