Home ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్: తల్లి, చెల్లి రోడ్డుమీద పడేందుకు కారణం చంద్రబాబు – Andhra Waves

వైఎస్ జగన్: తల్లి, చెల్లి రోడ్డుమీద పడేందుకు కారణం చంద్రబాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


YS Jagan:జగన్ ఇంట్లో గొడవ జరిగిందా.. ఆస్తుల మీద తల్లి కన్నీరు పెట్టుకున్నా.. చెల్లి బెంగళూరు వెళ్ళినా.. ఇలా ప్రతిదానికి చంద్రబాబు కారణం. అలా ప్రచారం చేస్తున్నారు జగన్ అండ్ కో. వైసీపీ.. ఆ పార్టీ అనుకూల మీడియా.. ఆ పార్టీ నాయకులకు చంద్రబాబు పేరు తలచుకోకపోతే నిద్ర పట్టడం లేదనుకుంటా. రాష్ట్రంలో ఏం జరిగినా సరే.. చివరికి సొంత ఇంట్లో ఆస్తి పంపకాల గొడవ జరిగినా సరే దానికి చంద్రబాబే కారణమని జగన్ బాధపడుతున్నారు. ఆయన […]

YS Jagan:జగన్ ఇంట్లో గొడవ జరిగిందా.. ఆస్తుల మీద తల్లి కన్నీరు పెట్టుకున్నా.. చెల్లి బెంగళూరు వెళ్ళినా.. ఇలా ప్రతిదానికి చంద్రబాబు కారణం. అలా ప్రచారం చేస్తున్నారు జగన్ అండ్ కో. వైసీపీ.. ఆ పార్టీ అనుకూల మీడియా.. ఆ పార్టీ నాయకులకు చంద్రబాబు పేరు తలచుకోకపోతే నిద్ర పట్టడం లేదనుకుంటా. రాష్ట్రంలో ఏం జరిగినా సరే.. చివరికి సొంత ఇంట్లో ఆస్తి పంపకాల గొడవ జరిగినా సరే దానికి చంద్రబాబే కారణమని జగన్ బాధపడుతున్నారు. ఆయన అనుచరులు కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఘటనకు చంద్రబాబు మాత్రమే కారణమని చెప్పడం ఇటీవల కాలంలో వైసిపికి అలవాటుగా మారిపోయింది. ప్రతి దానికి జిందా తిలిస్మాత్ మందు అయినట్టు.. వైసీపీలో ప్రతి పరిణామానికి చంద్రబాబు కారణమని చెప్పడం వైసిపికి అలవాటుగా మారిపోయింది.

బెంగళూరులోని యలహంక ప్యాలస్ విషయంలో షర్మిల.. విజయలక్ష్మి పై కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకొని.. వారిని రోడ్డుపైకి లాగింది జగన్. పైగా పోలీసుల చేత వారిని అడ్డగించారు. ఇప్పుడు ఆ తప్పును డైవర్ట్ చేయడానికి వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు జగన్. పైగా ఇదంతా చంద్రబాబు కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రేమ లేదనేది అందరికీ తెలుసు. నిజానికి జగన్ కుటుంబంలో వేలు పెట్టడానికి చంద్రబాబుకు ఏం అవసరం. పైగా ఆయన అలాంటి రాజకీయాలు చేసినట్టు ఇంతవరకు చరిత్రలో లేదు. షర్మిలకు చెందాల్సిన ప్యాలస్ ఆస్తిని బినామీ రికార్డుల పేరుతో కొట్టేయాలని జగన్ కు చంద్రబాబు ఏమైనా చెబుతున్నారా.. మేనకోడలి పెళ్లి వేడుకలకు కూడా అనుమతించకుండా అడ్డుకోవాలని.. తోడ పుట్టిన చెల్లిని.. కన్నతల్లిని కోర్టుల చుట్టూ తిప్పాలని.. కన్నీళ్లు పెట్టుకోవాలని జగన్ కు ఏమైనా చంద్రబాబు వివరించారా.. రక్తసంబంధాలను వదులుకుంటున్నా.. తీరా ఆ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిన తర్వాత.. పరుగు మొత్తం పోతున్న తర్వాత.. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారంటూ తమ అనుకూల మీడియా సంస్థల్లో కథనాలు రాయడం.. స్టోరీలు పబ్లిష్ చేయడం జగన్ కు అలవాటుగా మారిపోయింది.

స్వార్థం కోసం.. సొంత కుటుంబ సభ్యులను రోడ్డుకు ఇడ్చి.. వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి.. దానిని ప్రత్యర్థుల ఖాతాలోకి జమ చేయడం జగన్ అతి తెలివికి నిదర్శనం అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటువంటి వ్యవహార శైలి కాబట్టే 2024 ఎన్నికల్లో ఏపీ ప్రజలు 11 సీట్లకు పరిమితమయ్యారు.. కర్రు కాల్చి వాత పెట్టారని.. అయినా జగన్ కు బుద్ధి రావడం లేదని టిడిపి నేతలు అంటున్నారు. తన మీడియా ఏది రాస్తే దానిని గుడ్డిగా నమ్మే రోజులు లేవని టిడిపి నేతలు చెబుతున్నారు.

పబ్లిక్ లైఫ్ లో ఉన్నవాళ్లు తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకోవాలి. కుటుంబ సంబంధాల విషయంలో సమస్యలను పరిష్కరించుకోవాలి. అలాకాకుండా కోర్టు కేసులు వేయటం.. రోడ్లమీదకు తీసుకురావడం ఇటీవల కాలంలో జగన్ కు పరిపాటిగా మారింది. పైగా ఆ సమస్యను పరిష్కరించుకోకుండా చంద్రబాబు మీద ఆరోపణలు చేయడం విశేషం. సొంత మీడియాలో రాసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird