మీరు ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నారా? అయితే మీకో ముఖ్యమైన అలర్ట్. నవంబర్ 30వ తేదీలోపు మీరు ఒక పని తప్పనిసరిగా పూర్తి చేయాలి. లేదంటే మీ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్. అయితే ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఇంట్లో కూర్చునే ముఖాన్ని గుర్తించే విధానంతో ఆధార్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తయారు చేసుకోవచ్చు. అసలు ఈ సర్టిఫికెట్ ఎందుకు అవసరం? మొబైల్లో ఎలా తయారు చేసుకోవాలి? ఏ వివరాలు కావాలి? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.
ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ పొందుతున్న ప్రతేడాది తాము జీవించినట్లు నిరూపించుకోవాలి. సమర్పించే పత్రాన్నే లైఫ్ సర్టిఫికెట్ అంటారు. దీనినే డిజిటల్ విధానంలో సమర్పిస్తే జీవన్ ప్రమాణ్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అంటారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ చెల్లించే బ్యాంకు లేదా సంబంధిత శాఖ పెన్షన్ కొనసాగించేందుకు అవసరమైన వివరాలను ధ్రువీకరిస్తుంది. 2026 సంవత్సరానికి చాలా మంది ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ 30వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. గడువులోగా సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం లేదా అంతరాయాలు ఏర్పడవచ్చు.
ఇప్పుడు ఈ సర్టిఫికెట్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మొబైల్ ద్వారా తయారు చేసుకోవచ్చు. అందుకు మీ దగ్గర ఆధార్ నంబర్, ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్, పీపీఓ నంబర్ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబర్, పెన్షన్ ఖాతా వివరాలు ఉండాలి. అలాగే కెమెరా ఉన్న స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం అవసరం. మీ ఫోన్లో జీవన్ ప్రమాణ్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.
ముందుగా మీ మొబైల్లో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్, జీవన్ ప్రమాణ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మొదట జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేసి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలు నమోదు చేయాలి. అవసరమైన వెరిఫికేషన్ పూర్తి చేయాలి. తర్వాత మీ పేరు, పెన్షన్ రకం, పీపీఓ నంబర్, పెన్షన్ చెల్లించే బ్యాంకు వివరాలను నమోదు చేయాలి. మీరు ఒక్కటి ఎక్కువ పెన్షన్లు తీసుకుంటున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలి. ఆ తర్వాత Facebook ఆథెంటికేషన్ ప్రక్రియ జరిగింది. మొబైల్ కెమెరా ముందు మీ ముఖాన్ని ఉంచాలి. యాప్ సూచించిన విధంగా ఫోన్ను సరైన దూరంలో పట్టుకోవాలి. కెమెరా ముందు ముఖాన్ని కదలకుండా ఉంచి, యాప్ సూచించినప్పుడు కళ్లు రెప్పవేయాలి. మీ ముఖాన్ని విజయవంతంగా గుర్తించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ తయారవుతుంది.
ఇది కూడా చదవండి: డిజిటల్ పేమెంట్లపై కొత్త రూల్స్..
Facebook ఆథెంటికేషన్ సక్సెస్ అయితే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో జీవన్ ప్రమాణ్ ఐడీ లేదా ప్రమాణ్ ఐడీ ఉంటుంది. ఈ ఐడీ ద్వారా మీ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవచ్చు. అలాగే మీ పెన్షన్ చెల్లించే బ్యాంకు లేదా సంబంధిత సర్టిఫికెట్ చేరిందో లేదో కూడా నిర్ధారించుకోవాలి.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. ఇతర అర్హులైన ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. మొబైల్లో సర్టిఫికెట్ తయారు చేయడం కుదరకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. UMANG యాప్ ద్వారా ప్రయత్నించవచ్చు. లేదంటే బ్యాంకు శాఖకు వెళ్లి సమర్పించవచ్చు. డోర్స్టెప్ బ్యాంకింగ్ సేవ ద్వారా ఇంటి వద్ద నుంచే ఈ సదుపాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది.
కాబట్టి ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నవారు నవంబర్ 30వ తేదీ గడువును గుర్తుంచుకోండి. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న వృద్ధులకు ఈ విషయం తెలియజేయండి.
మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
