హారర్, మిస్టరీ, సర్వైవల్ థ్రిల్లర్ కథలను ఇష్టపడేవారికి అదిరిపోయే వెబ్‌సిరీస్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఫ్రమ్’ . ఇప్పటికే మూడు సీజన్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్ ఇప్పుడు ఓటిటిలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా మూడు సీజన్లను ఒకేసారి చూసే అవకాశం రావడంతో హారర్ థ్రిల్లర్ ప్రియులు ఈ సిరీస్‌పై ఆసక్తి చూపుతున్నారు.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే .. ‘ఫ్రామ్’ వెబ్‌సిరీస్ కథ ఓ అంతుచిక్కని పట్టణం చుట్టూ తిరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తున్న కొందరు రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్టును దాటిన తర్వాత ఓ వింత పట్టణంలోకి చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి బయటపడటం అసాధ్యం. ఎటు వెళ్లినా, ఎంత దూరం తాగినా మళ్లీ అదే పట్టణానికి చేరుకుంటారు. ఇలా అక్కడికి వచ్చినవారంతా ఓ విచిత్రమైన ఉచ్చులో చిక్కుకుపోతారు.
పగటిపూట ఆ పట్టణం సాధారణంగానే కనిపిస్తుంది. కానీ రాత్రి కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. చుట్టూ ఉన్న అడవి నుంచి మనుషుల రూపంలో కనిపించే భయంకరమైన జీవులు బయటకు వచ్చి పట్టణంలోని వారిపై దాడి చేస్తున్నారు. వాటి బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యేకమైన రక్షణ రాళ్లు ఉన్న ఇళ్లలో తలుపులు మూసుకుని ఉండాల్సిందే.
అసలు ఆ పట్టణం ఎక్కడ ఉంది? అక్కడికి వచ్చినవారు ఎందుకు బయటకు వెళ్లలేకపోతున్నారు? రాత్రివేళ కనిపించే ఆ వింత జీవులు ఎవరు? ఈ రహస్యాల వెనుక ఉన్న అసలు కారణమేంటి? అనే ప్రశ్నలతో కథనం ఉత్కంఠగా సాగుతుంది.
ఇప్పటివరకు మూడు సీజన్లుగా ప్రేక్షకులను అలరించిన ‘ఫ్రామ్’ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సీజన్లో పది ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి సీజన్ దాదాపు 10 గంటలు, రెండో సీజన్ 8 గంటల 16 నిమిషాలు, మూడో సీజన్ 8 గంటల 49 నిమిషాల నిడివితో సాగుతుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి..
మరిన్ని ఓటిటి అప్డేట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
