రైల్వే యార్డ్‌లో నిలిపి ఉంచిన రైలు కోచ్‌లో ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశాడు. అయితే, గోల్డ్ రింగ్ కారణంగా ఓ హంతకుడు పోలీసులకు పట్టుబడ్డాడు. హత్య జరిగిన 6 గంటల్లోనే అతడు పోలీసులకు దొరికాడు. ఈ సంఘటనలో తమిళనాడు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 13వ తేదీ అర్ధరాత్రి నాగర్‌కోయిల్ రైల్వే యార్డులో నిలిపి ఉన్న ఓ ఖాళీ బోగీలో ఓ వ్యక్తి 54 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశాడు.
తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. రైలుకు ఆ బోగీని జత చేసేందుకు శుభ్రం చేస్తున్న సిబ్బందికి లోపల మరో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు ఎవరో గుర్తించేందుకు ఆధారాలు లేకపోవడంతో, ఆమె చేతికి ఉన్న పాము ఆకారపు బంగారు ఉంగరంపై రైల్వే పోలీసులు దృష్టి సారించారు. ఆ ఉంగరంపై ఉన్న హాల్‌మార్క్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేసింది. అది గుజరాత్లో తయారై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న నగర వ్యాపారికి సరఫరా అయినట్లు పేర్కొన్నారు.
ఆ వ్యాపారి వద్ద ఉన్న వివరాలను పరిశీలించగా, ఉంగరం కొనుగోలు సమయంలో ఆమె ఇచ్చిన పాన్ కార్డు, మధ్యప్రదేశ్ చిరునామా లభించింది. పోలీసులకు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ దొరికింది. గత మూడు నెలలుగా ఆమె స్వగ్రామం నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులకు తెలిసింది. మృతురాలి గుర్తింపును ఛేదించడంతో పాటు, రైల్వే పోలీసులు ఆరు గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తొలుత ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో తెల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి బోగీ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయి. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై భిక్షాటనూ తిరిగే నిందితుడికి, బాధితురాలితో అంతకుముందే కొంత పరిచయం ఉంది. ఆ మహిళను ఖాళీ బోగీలోకి తీసుకెళ్లి, బలవంతంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. నిందితుడు ఘటన సమయంలో ధరించి, ఓ మురుగు కాలువలో పడేసిన రక్తపు మరకల చొక్కాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
The post హంతకుడిని పట్టుకున్న గోల్డ్ రింగ్! iDreamPostలో మొదట కనిపించారు.
