తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వాళ్లకు టాటా టియాగో మంచి ఆప్షన్‌గా మారింది. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ కారు 70,555 యూనిట్లు అమ్ముడైంది. టాటా మోటార్స్ కార్ల అమ్మకాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. కంపెనీకి చెందిన సియెర్రా, హారియర్, ఆల్ట్రోజ్, కర్వ్, సఫారీ వంటి మోడళ్ల కంటే టియాగో అమ్మకాలే ఎక్కువగా ఉన్నాయి. రూ.4.76 లక్షల ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరతో అందుబాటులో ఉండటం కూడా ఈ కారు ప్రత్యేకత.
అమ్మకాల్లో టియాగోకు మూడో స్థానం
2026 మొదటి 10 నెలల్లో టాటా మోటార్స్ మొత్తం 6,49,477 కార్లను విక్రయించింది. ఇందులో 2,02,794 యూనిట్లతో పంచ్ మొదటి స్థానంలో నిలిచింది. 1,96,490 యూనిట్లతో నెక్సాన్ రెండో స్థానంలో ఉంది. టియాగో 70,555 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. సియెర్రా 69,779 యూనిట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అంటే సియెర్రా కంటే టియాగో అమ్మకాలు 776 యూనిట్లు ఎక్కువ. హారియర్ 31,810, ఆల్ట్రోజ్ 27,579, కర్వ్ 18,447, సఫారీ 17,088 యూనిట్ల అమ్మకాలు నమోదు చేశాయి.
పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆప్షన్లు
టియాగోలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా టియాగో ఈవీ పేరుతో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. 2026లో అప్డేట్ చేసిన టియాగో పెట్రోల్ బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర సుమారు రూ.4.76 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర మారుతుంది. సీఎన్జీ వేరియంట్ల ధరలు పెట్రోల్ మోడళ్ల కంటే ఎక్కువగా ఉంటాయి. నగరాల్లో రోజూ వినియోగించే వారు, తక్కువ బడ్జెట్ చిన్న కారు కోరుకునే వారికి ఈ మూడు ఇంధన ఎంపికలు ఉపయోగపడతాయి.
మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్
టియాగోలో 1.2 లీటర్, సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ మూడు ఉంటుంది. ఇది 86 పీఎస్ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వెర్షన్లో 75.5 పీఎస్ పవర్, 96.5 ఎన్ఎం టార్క్ లభిస్తుంది. పెట్రోల్, సీఎన్జీ మోడళ్లలోనూ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏంటి గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. 2026 టియాగో సీఎన్జీ ఏఎంటీ వెర్షన్లో ప్యాడిల్ షిఫ్టర్లు ఇవ్వడం మరో ప్రత్యేకత. వేరియంట్‌ను బట్టి ఫీచర్లు మారుతాయి.
10.25 ఇంచుల టచ్‌స్క్రీన్
కొత్త టియాగోలో ఇంటీరియర్‌ను కూడా అప్డేట్ చేశారు. టాప్ వేరియంట్లలో 10.25 ఇంచుల టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, వెనుక ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు అందిస్తున్నారు. 360 డిగ్రీ కెమెరా కూడా కొన్ని వేరియంట్లలో లభిస్తుంది. అయితే అన్ని ఫీచర్లు బేస్ మోడల్లో ఉండవు. కారు కొనేముందు మీకు కావాల్సిన ఫీచర్లు ఏ వేరియంట్లో ఉన్నాయో పరిశీలించడం మంచిది.
The post టాటా కారుకు అదిరిపోయే డిమాండ్ appeared first on iDreamPost.
