Home సినిమా ఇంకాస్త దిగొచ్చిన పసిడి ధరలు! – iDreamPost – Andhra Waves

ఇంకాస్త దిగొచ్చిన పసిడి ధరలు! – iDreamPost – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఇంకాస్త దిగొచ్చిన పసిడి ధరలు! - iDreamPost


బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది కొంత ఊరటనిచ్చే వార్త. గత క్రమంగా ఆకాశన్నంటిన పసిడి ధరలు ఇప్పుడు భారీగా దిగివస్తున్నాయి. ఒక్క రోజులోనే బంగారం, వెండి ధరలు తగ్గాయి. ముఖ్యంగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.23 వేల మేర తగ్గడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో పూర్తి వివరాలు చూడండి..

నవంబర్ 21న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,560గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,090గా నమోదైంది.ఇక వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర సుమారు రూ.1.75 లక్షల వద్ద కొనసాగుతోంది. అయితే నగల దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,710గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,15,240గా ఉంది. ముంబైలో హైదరాబాద్ మాదిరిగానే 24 క్యారెట్ల బంగారం రూ.1,25,560, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,090గా ఉంది.

బంగారం ధరల్లో వచ్చిన మార్పును గమనిస్తే పరిస్థితి ఎంతలా మారిందో అర్థమవుతుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం అక్టోబర్ 19న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,406గా ఉంది. నవంబర్ 20 నాటికి అదే బంగారం ధర రూ.1,23,584కి పడిపోయింది. అంటే దాదాపు నెల రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ.22,822 తగ్గింది. నవంబర్ 20న ఒక్కరోజే సాయంత్రం ధర ప్రకారం బంగారం రూ.5,638 తగ్గింది.

బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొనుగోలుదారులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నవంబర్ 20న ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ సాయంత్రం ధర ప్రకారం కిలో వెండి రూ.1,52,528కి చేరింది. అంతకుముందు రోజు ధరతో ప్రస్తుత రూ.7,911 తగ్గింది.అయితే, గత నెల రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా తగ్గుదల కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నా.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి రానున్న రోజుల్లో ధరలు మళ్లీ మారే అవకాశం ఉంది.

మరిన్ని తాజా అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird