Home సినిమా SA vs AUS: ఆస్ట్రేలియాను అడ్డుకున్న బావుమా.. సెంచరీతో వీరోచిత పోరాటం – Andhra Waves

SA vs AUS: ఆస్ట్రేలియాను అడ్డుకున్న బావుమా.. సెంచరీతో వీరోచిత పోరాటం – Andhra Waves

by andhra andhrawave
0 comments
SA vs AUS: ఆస్ట్రేలియాను అడ్డుకున్న బావుమా.. సెంచరీతో వీరోచిత పోరాటం


40 పరుగులకే నాలుగు వికెట్లు.. 110 పరుగులకే ఆరు వికెట్లు.. ఒకవైపు నలుగురు పదునైన ఫాస్ట్ బౌలర్లతో ఆస్ట్రేలియా ఎటాక్.. మరోవైపు కుప్పకూలుతున్న సౌతాఫ్రికా బ్యాటింగ్! క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒక్కడే గోడలా నిలబడ్డాడు ఇలాంటి జట్టు కెప్టెన్ టెంబా బావుమా. సహచరులు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నా.. పట్టుదలతో బ్యాటింగ్ చేస్తూ అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఆస్ట్రేలియా పేస్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ సౌతాఫ్రికా పోరాటాన్ని కొనసాగించింది.

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో కంగారుల బౌలర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి ఆటలో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగుతుంది. నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగిన ఆసీస్, దక్షిణాఫ్రికా బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోలేకపోయింది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడటంతో రెండో రోజు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.

మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ వికెట్ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా 110 పరుగులకే ఆరో వికెట్ కోల్పోయింది. ఈ దశలో జట్టు భారీ స్కోరు సాధించడం కష్టమేనని అనిపించింది. అయితే కెప్టెన్ బావుమా, ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జాన్సెన్ దూకుడుగా ఆడుతూ అర్ధసెంచరీ సాధించగా.. మరోవైపు బావుమా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు.
జాన్సెన్ 85 పరుగులు చేసి వెనుదిరిగినా బావుమా తన పోరాటాన్ని కొనసాగించాడు. ఆసీస్ బౌలర్లను ఓపిగ్గా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్‌గా ముందుండి నడిపించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. బావుమా 104 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.

రచయిత అవతార్

బాబు.పొలిచర్ల

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird