Home సినిమా ఓటిటిలోకి దృశ్యం 3.. డేట్ ఫిక్స్! – Andhra Waves

ఓటిటిలోకి దృశ్యం 3.. డేట్ ఫిక్స్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఓటిటిలోకి దృశ్యం 3.. డేట్ ఫిక్స్!


క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి గుడ్ న్యూస్. అజయ్ దేవగన్ నటించిన ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ విడుదలకు ముందు కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.. తాజాగా మద్రాస్ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో అఫీషియల్ ఓటిటి డేట్ ఫిక్స్ అయింది. దీని గురించి ఓ లుక్ వేసేయండి..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. విజయ్ సల్గావ్‌కర్ పాత్రలో అజయ్ దేవగన్ మరోసారి కనిపించనున్నారు. తన కుటుంబాన్ని ఒక హత్య కేసు నుంచి కాపాడేందుకు గతంలో అతను వేసిన పథకాలు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. అయితే ఈసారి పరిస్థితులు మరింత స్పష్టంగా మారనున్నాయి.

సామ్ దేశ్‌ముఖ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు మళ్లీ ప్రారంభిస్తారు. ఈ కేసులో కొత్త ఆధారాలు బయటపడడంతో విజయ్ కుటుంబంపై అనుమానాలు పెరుగుతాయి. గతంలో విజయ్ చెప్పిన విషయాలను మరో కోణంలో పరిశీలించిన పోలీసు అధికారి రంగంలోకి దిగుతారు. ఎస్పీ రాజ్‌వీర్ సింగ్ తోమర్ పాత్రలో జైదీప్ అహ్లావత్ కనిపించనున్నారు.

మరోవైపు ఐజీ మీరా దేశ్‌ముఖ్ పాత్రలో టబు కూడా కీలకంగా కనిపించనుంది. తన కుమారుడి అదృశ్యం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం ఆమె పాత్రలో ప్రధానంగా ఉంటుంది. ఈ పరిణామాల మధ్య విజయ్ సల్గావ్‌కర్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? పోలీసుల విచారణ నుంచి మరోసారి ఎలా బయటపడతాడు? అన్నదే ఈ మూడో భాగంలో ఆసక్తికరంగా మారనుంది.

అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సంస్థ. థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను మిస్ అయినవారు ఓటీటీలో చూడొచ్చు. కాబట్టి ఈ సినిమా అసలు మిస్ అవ్వకుండా చూసేయండి.

మరిన్ని ఓటిటి అప్‌డేట్‌ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird