Home సినిమా విమానం కూలి 9 మంది మృతి – Andhra Waves

విమానం కూలి 9 మంది మృతి – Andhra Waves

by andhra andhrawave
0 comments
విమానం కూలి 9 మంది మృతి


దారుణ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన
అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. తొమ్మిది మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ విమానం రద్దీగా ఉండే నివాస ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీ అగ్నిగోళంలా పేలిపోవడంతో అందులో ఉన్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.

పామ్ బీచ్ కౌంటీలోని క్రెస్ట్‌హెవెన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12:50 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం సంభవించిన ప్రదేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ప్రముఖ ‘మార్-ఎ-లాగో’ రిసార్ట్‌కు కేవలం 9 మైళ్ల (14) దూరంలో ఉన్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

35,000 అడుగుల ఎత్తులో ఉండగా

టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు బయలుదేరిన ‘లియర్‌జెట్ 60’ (టెయిల్ నంబర్ N722BD) విమానం ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురైంది. సుమారు 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్రమైన గాలివాన, మంచు పేరుకుపోవడం, వర్షపాతం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురయ్యాయని పైలట్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ విమానాన్ని మరొకరు 2,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లేందుకు పైలట్లు అనుమతి కోరుతూ, కొద్ది క్షణాల్లోనే విమానం వేగంగా కిందకు దూసుకొచ్చి రహదారి సమీపంలో కూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఇది కూడా చదవండి : ఈ ఫోన్ బూత్‌లో మరణించిన వారితో మాట్లాడొచ్చు!

డ్యాష్‌క్యామ్‌లలో భయానక దృశ్యాలు..

వేగంగా కిందకు పడిపోతున్న దృశ్యాలు సమీపంలోని కార్లలో వెళ్తున్న ప్రయాణికుల కెమెరాల్లో రికార్డు అయ్యాయి. విమానం నేలను తాకగా భారీ పేలుడు సంభవించి, రహదారిపై పెద్ద గుంతగానే ఏర్పడింది. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్నంతటినీ కమ్మేసింది. విమానం ఇళ్లకు అతి సమీపంలో కూలతోపాటు, ఆ ప్రాంతంలో ఉంటున్న స్థానికులకు ఎలాంటి గాయాలు కాలేదు, ప్రాణనష్టం సంభవించలేదని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ తెలిపారు.

అమెరికా రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, విమానంలో ధ్రువీకరించిన తొమ్మిది మంది మరణించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను బయటకి తీసేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ , నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ బృందాలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird