
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 1,09,540 కోట్ల నికర లాభం సాధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 16.9 శాతం వృద్ధి. అంతే కాదు ఈ నికర లాభం ఇప్పటివరకు అత్యధిక అర్ధవార్షిక లాభంకూడా. సెప్టెంబర్ 30, 2026 నాటికి స్థూల మొండి బాకీల నిష్పత్తి 1.69 శాతం, నికర మొండి బాకీల నిష్పత్తి 0.33 శాతం తగ్గింది. లాభాల పెరుగుదల, మొండి బాకీల తగ్గుదల ఆర్థిక మెరుగుదలలుగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఫలితాలు ఎలా వచ్చాయి, ఎవరి నిధులతో సాధ్యమవుతాయి, భవిష్యత్తులో ఎంతవరకు నిలకడగా ఉంటాయో పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారత బ్యాంకింగ్ రంగంలో మొండి బాకీల మూలాలు 2006, 2011 మధ్య కాలంలో జరిగిన రుణ విస్తరణలో సమస్య కనిపిస్తుంది. ఆ సమయంలో బ్యాంకు రుణాలు సగటున 20 శాతం పెరిగాయి. ముఖ్యంగా విద్యుత్, ఉక్కు, టెలికాం, రోడ్లు, విమానయాన రంగాల్లో భారీ దీర్ఘకాలిక రుణాలు మంజూరయ్యాయి. ప్రాజెక్టుల జాప్యం, వ్యయాల పెరుగుదల, ఆదాయ లోటు వంటి కారణాలతో సమస్యలు ఉత్పన్నమైనా, అప్పట్లో రుణాలను పునర్వ్యవస్థీకరించిన ఆస్తులుగా చూపుతూ నష్టాలను చూచాయగా గుర్తించిన పరిస్థితి.
2013–14 నాటికి ప్రభుత్వ బ్యాంకుల నికర లాభం రూ. 37,017 కోట్లుగా కనిపించినా, స్థూల మొండి బాకీలు రూ. 2.27 లక్ష కోట్లుగా సుమారు 4.4 శాతం ఉన్నాయి. తర్వాత 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద రుణాల పర్యవేక్షణ కోసం కేంద్రీకృత సమాచార నిల్వ వ్యవస్థను ప్రారంభించింది. 2015 ఆగస్టులో ఇంద్రధనుష్’ పథకం, ఆస్తుల నాణ్యత సమీక్ష ప్రారంభమైన తర్వాత గతంలో దాగి ఉన్న మొండి బాకీలు బయటపడ్డాయి. దీనితో స్థూల మొండి బాకీల నిష్పత్తి2015 మార్చిలో 4.3 శాతం నుంచి 2016 మార్చిలో 7.5 శాతం, 2018 మార్చిలో 11.5 శాతం చేరింది. 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ బ్యాంకులు వరుసగా రూ. 85,370 కోట్లు, రూ. 81,752 కోట్ల నికర నష్టాలను నమోదు చేశాయి. ఆ తర్వాత 2019–20లో 27 ప్రభుత్వ బ్యాంకులను 12 బ్యాంకులుగా విలీనం చేయడం, 2016–17 నుంచి 2020–21 మధ్య రూ. 3,10,997 కోట్ల పునర్వ్యవస్థీకరణ మూలధనం సమకూర్చడం వంటి చర్యలతో 2021–22 నుంచి బ్యాంకులు తిరిగి లాభాల బాట పట్టాయి. ఈ ప్రక్రియలో దివాలా, లిక్విడేషన్ చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (2017), పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం వంటి మార్పులు కీలకంగా మారాయి. 2018 ఫిబ్రవరి 12 నాటి ఆర్బీఐ సర్క్యులర్‌ను 2019 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు కొట్టివేసిన అనంతరం కొత్త పరిష్కార నిబంధనలు రూపొందించబడ్డాయి. అలాగే రైటాఫ్ అనేది రుణమాఫీ కాదని, కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమేనని, రుణగ్రహీత బాధ్యత రద్దు కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభకు స్పష్టం చేసింది. 2015–16 నుంచి 2024–25 మధ్య ప్రభుత్వ బ్యాంకులు రూ. 12,08,828 కోట్ల రుణాలను రైటాఫ్ చేసినప్పటికీ, వసూలు చర్యలు కొనసాగుతున్నాయి.
రాజకీయ, సామాజిక కోణంలో ఈ భిన్న వాదనలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు సంస్కరణలు, మూలధన సమీకరణతో బ్యాంకుల పరిస్థితి మెరుగుపడిందని చెబుతుండగా.. మరోవైపు రైటాఫ్లు, పన్ను చెల్లింపుదారుల నిధుల వినియోగంపై చర్చ. డిపాజిట్లలో 58.8 శాతం, రుణాల్లో 56.2 శాతం వాటాతో ప్రభుత్వ బ్యాంకులు వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ప్రాధాన్యత రంగాలకు కీలక సేవలు అందించినప్పటికీ.. శాఖల విస్తరణ, సిబ్బంది సంఖ్య, డిజిటల్ పోటీ వంటి అంశాల్లో సవాళ్లు ఉన్నాయి. మరో ప్రభుత్వ ప్రకటనలోని రూ. 275 లక్ష కోట్ల డిపాజిట్లు’ అనే అంకెపై సందేహాలు, అనుమానాలు తలెత్తాయి. అక్టోబర్ 31, 2026 నాటికి దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లే రూ. 282.5 లక్షల కోట్లుగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ బ్యాంకుల డిపాజిట్లు సుమారు రూ. 165 లక్ష కోట్లు ఉండాలంటే, దానికి రూ. 136.4 లక్ష కోట్ల అడ్వాన్సులు కలిపితే దాదాపు రూ. 301.6 లక్ష కోట్ల మొత్తం వ్యాపారం సరిపోతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఆర్బీఐ ప్రభుత్వ ఆస్తులు వృద్ధి చెందుతాయి. బ్యాంకుల ద్వారా రాబడి ( 111 శాతంగా ఉండగా, జూన్ 2026 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం మీద రాబడి 1.33 శాతం ఉంది. ప్రభుత్వ బ్యాంకుల రుణాలు 18.8 శాతం పెరిగినప్పుడు డిపాజిట్లు 13.1 శాతం మాత్రమే రుణం, డిపాజిట్ నిష్పత్తి 12 శాతంగా ఉంది నిష్పత్తిలో మొండి బాకీల నిష్పత్తి 5.1 శాతంగా (మొత్తం మొండి బాకీల్లో 37.2 శాతం వాటా) ఉంది.
ఇది కూడా చదవండి: ఆర్బీఐ బంపర్ ఆఫర్: బ్యాంకింగ్ షేర్లలో లాభాల జాతర!
ఆర్బీఐ జూన్ 2026 ఆర్థిక స్థిరత్వ నివేదికలోని స్ట్రెస్ టెస్ట్ ప్రకారం, ప్రతికూల పరిస్థితుల స్థాయి మొండి బాకీల నిష్పత్తి 3.8 శాతం, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో 5.1 శాతం పెరిగే అవకాశం, కనీస మూలధన నిబంధనలు అతిక్రమించబడవని అంచనా వేసింది. మున్ముందు రుణ వృద్ధికి తగినంత డిపాజిట్లను సమీకరించడం, వ్యవసాయం, ఇతర రంగాల్లో రుణ నాణ్యతను కాపాడుకోవడం బ్యాంకులకు కీలక అంశాలుగా నిలువున్నాయి.

అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వడ్డీ రేట్ల మార్పులు, వసూళ్ల వేగం వంటి అంశాలు బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్పష్టంగా పారదర్శకత, ఖచ్చితత్వంపై ప్రజలు, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి కొనసాగుతోంది. నిజమైన వసూళ్లు, రైటాఫ్‌లు, ప్రొవిజనింగ్ మార్పుల వివరాలను స్పష్టంగా కనుగొనడం ద్వారా బ్యాంకింగ్ రంగ స్థితిగతులకు మరింత స్పష్టత లభిస్తుందని పరిశీలకులు.
మీకు నచ్చవచ్చు: ట్రంప్ నోట ఇండియాపై పొగడ్తలు: భారత్ ను చూసి నేర్చుకోవలంటూ ఫెడరల్ రిజర్వ్ కు సుద్దులు.!
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్: AI రూపంలో పొంచి ఉన్న కొత్త ముప్పు!
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Public Sector Banks, Profits, GNPA, NNPA, Banking Reforms, Reserve Bank report, TeluguOne]
